శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఆషాడ మాసం సందర్భముగా తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి దేవాలయములలోని శ్రీ అమ్మవార్లకు ప్రతి సంవత్సరంలాగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి వారి తరపున పవిత్ర సారె సమర్పించవలసినదిగా ఉమ్మడి దేవాలయముల చైర్మన్ మరియు కమిటీ సభ్యుల వారి ఆహ్వానం మేరకు ఉమ్మడి దేవాలయముల అమ్మవార్లకు పవిత్ర సారె సమర్పించుట లో భాగముగా ఈరోజు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఉమ్మడి దేవాలయములకు విచ్చేయగా ఉమ్మడి దేవాలయముల చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఉమ్మడి దేవాలయములో ని అమ్మవార్లను దర్శనం చేసుకొని, పూజలు జరిపి శ్రీ అమ్మవార్లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరఫున పవిత్ర సారె అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ గారు, పర్యవేక్షకులు శ్రీ చందు శ్రీను గారు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment