నెల్లూరు (ప్రజా అమరావతి);
రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టార
ని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా రైతులకు సుస్థిరమైన ఆదాయం కలిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబందించి ఒక్కొక్కటి 38 లక్షల రూపాయలు విలువ చేసే సంచార పశు మొబైల్ క్లినిక్ వాహనాన్ని ప్రతి నియోజక వర్గానికి కేటాయించడం జరిగిందని, పాడి రైతు తమ పశువులకు జబ్బు చేస్తే 1962 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వైద్యం చేసుకునేలా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రబీ సీజన్ లో సుమారు 5.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, ఆ ధాన్యం కొనుగోలుకు సంబందించి ఇంకా రైతులకు సుమారు 239 కోట్ల రూపాయలు ధాన్యం నగదు చెలించాల్సివుందని, అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరగా రైతులకు ధాన్యం నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే గత రెండు సంవత్సరాల నుండి పంట కాలువల మరమత్తులకు సంబందించిన బిల్లులు చెలించాల్సివుందని వాటిని కూడా త్వరగా చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్ట పరిహారం కింద పాడి రైతులకు నష్ట పరిహారం వీలైనంత త్వరగా చెలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, అధికారులకు సూచించారు.రైతుల సంక్షేమం కోసం నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారన్నారు. రైతు సాగు ప్రారంభం నుంచి పంటలు విక్రయించుకునే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఆర్.బి.కెల ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ దిగుబడులను పెంచడం, రైతులకు ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో కీలకంగా వ్యవహరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, రైతులు తాము పండించిన పంటను ఇ క్రాప్ లో నమోదు కాకపోవడం వల్ల వివిధ ప్రయోజనాలను రైతులు కోల్పోతున్నారని, ముఖ్యంగా పంటల నష్టం జరిగిన సమయంలో నష్టపరిహారం పొందడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ఇ క్రాప్ పై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, ప్రతి రైతు ఇ క్రాప్ చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ డిమాండ్ మరియు సదుపాయాలు వున్న పంటలపై రైతులకు అవగాహన కల్పించి మార్కెట్ డిమాండ్ వున్న పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలే వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు చెందిన అధికారులు కృషి చేయాలన్నారు. మూస పద్దతిలో కాకుండా రైతుకు ఆదాయం పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్దతులను పోత్సహించేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తప్పనిసరిగా వారానికి ఒక రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. రానున్న సీజన్లో ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బందులు పడకుండా ఇప్పటినుండే ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ఆర్.బి.కె లు అలంకార ప్రాయం కాకుండా రైతులకు సంబందించిన అన్నీ సమస్యలకు ఒక పరిష్కార వేదికగా మారాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో రీ సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరుగుచున్నదని, రైతులకు రీ సర్వే కార్యక్రమం పై అవగాహన కల్పించి రీసర్వే సిబ్బందికి సహకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు అందచేయడంతో పాటు వారికి విరివిగా రుణాలు ఇచ్చేలా బ్యాంకులు ముందుకు రావాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగష్టు మాసం 1 నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తీరంగా .. ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఈ సంధర్భంగా అధికారులను ఆదేశించారు.
కందుకూరు శాసన సభ్యులు శ్రీ మనుగుంట మహిధర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టించి సాగు చేస్తున్న రైతు తాను పండించిన పంటను అమ్ముకునే సమయంలో మోసపోతున్నారని, రైతు మార్కెటింగ్ విషయంలో మోసపోకుండా రైతులకు మార్కెటింగ్ పరిస్థితులపై పూర్తిగా అవగాహన కల్పించి గిట్టు బాటు ధర అందేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించి రైతులకు సుస్థిర ఆదాయం కల్పించేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ ఫారెస్ట్రి ని కూడా అభివృద్ది చేయాలని, ఉన్న నీటి వనరులు రైతులకు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని శ్రీ మహిధర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఏ పంటకు ఏ భూమి అనువైనదో రైతులకు అవగాన కల్పించాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్.బి.కె స్థాయిలోను, రెండవ శుక్రవారం మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి, ఆ సమావేశాల్లో వచ్చే సూచనలు, సలహాలను జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో చర్చించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం, అవసరమైతే ప్రభుత్వంనకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని తెలిపారు.
ఈ సంధర్భంగా 2022-2023 సంవత్సరానికి సంబందించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, కందుకూరు శాసన సభ్యులు శ్రీ మనుగుంట మహిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ లతో కలసి ఆవిష్కరించారు.
తొలుత జిల్లాలో వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాల అభివృద్దికి చేపడుతున్న కార్యక్రమాలను సంబందిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జె.డి శ్రీ సుధాకర్ రాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్రీ ఎం.వి. సుబ్బారెడ్డి, పౌర సరఫరాల శాఖ డి.ఎం శ్రీమతి పి. పద్మ, ఎల్.డి.ఎం శ్రీ టి. శ్రీకాంత్ ప్రదీప్ కుమార్, ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణారావు, మార్క్ ఫెడ్ డి.ఎం శ్రీ పవన్, ఏ.డి. మార్కెటింగ్ శ్రీమతి అనిత కుమారి, ఏ.పి.ఎం.ఐ.పి పిడి శ్రీ శ్రీనివాసులు, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment