*- టిడీపీ కార్యకర్తల ఆరోగ్యం, ఉపాధి కార్యక్రమాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి*
*-:యువత పట్ల తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది*
*- కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్*
గుడివాడ, జూలై 8 (ప్రజా అమరావతి)
: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆరోగ్యం, ఉపాధి కార్యక్రమాలపై నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎన్టీఆర్ స్పూర్తి -చంద్రన్న భరోసా కార్యక్రమంలో చంద్రబాబు, టీడీపీ శ్రేణులతో కలిసి శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ర్యాపిడో, న్యూట్రిఫుల్ స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం జరిగిన పలు ఆత్మీయ సమావేశాల్లో చంద్రబాబు సమక్షంలో శిష్ట్లా లోహిత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమంలో భాగంగా ఆరోగ్యం, ఉపాధి వంటి కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించిందన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున దాదాపు రూ.100 కోట్లను అందించడం జరిగిందన్నారు. కొత్తగా ఉపాధికి సంబంధించి ర్యాపిడ్ యాప్ ను రూపొందించామన్నారు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న కార్యకర్తలు రూ. వెయ్యి నుండి రూ.2 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ యాప్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం 8897883311 నెంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుందని చంద్రబాబు, లోకేష్ లు అభిప్రాయపడ్డారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో న్యూట్రిపుల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. డయాబెటిస్, బరువు సమస్యలు, థైరాయిడ్ వంటి ఇబ్బందులకు ప్రముఖ వైద్యులచే సలహాలను అందించడం జరుగుతుందన్నారు. సరైన డైట్ ప్లాన్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చెప్పారు. మార్కెట్లో ఎన్నో యాప్ లు ఉన్నాయని, టీడీపీ కార్యకర్తల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూట్రిఫుల్ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. యువత పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఉందని, ఇందుకు తానే నిదర్శనమని చెప్పారు. గతంలో కన్నా ఎక్కువగా యువతను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇందు కోసం క్యాడర్ వెల్ఫేర్ 2.0 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రుల్లో తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని కొనసాగిస్తున్నామన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.
addComments
Post a Comment