రామాయపట్నం పోర్టు పనులను రేపు ప్రారంభించనున్న సీఎం
అమరావతి (ప్రజా అమరావతి);
– ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు
– రామాయపట్నం పోర్టు పనులను రేపు ప్రారంభించనున్న సీఎం
– వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం
– ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు
– పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం.
– రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు.
– రాష్ట్ర ప్రభుత్వ సంçస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును నిర్మించనున్న రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
–తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం.
– ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి.
–కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం
– రెండోదశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం.
–ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు.
–తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం.
బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్లు తదితర రవాణాలో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు.
–రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవారంగానికి ఊతం ఇవ్వనున్న పోర్టు.
ఫుడ్‌ప్రాసింగ్, సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, ఎలక్ట్రానిక్స్, విద్యుత్, టెక్స్‌టైల్, టూరిజం రంగాలకు పోర్టు ద్వారా మేలు.
–ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్ తదితర ఎగుమతుల్లో కీలకం కానున్న రాయాయపట్నం పోర్టు.
– ఇదే పోర్టుతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం.
– ప్రతి కోస్తా జిల్లాలకూ ఒక ఫిషింగ్ హార్బర్ ఉండేలా 9 హార్బర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.
– మౌలిక సదుపాయాల కల్పనలో గొప్ప మార్పు.
– రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం.
– ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.
– జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. చురుగ్గా పనులు.
– రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం.
– బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల నిర్మాణం.
– వీటిద్వారా 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తలు సేకరణకు వీలు. విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ.
– దాదాపు 85వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు.
addComments
Post a Comment