ఎస్సి, ఎస్టి రైతులకు ఉచిత కందులు పంపిణీ

 *ఎస్సి, ఎస్టి రైతులకు ఉచిత కందులు పంపిణీ


*


ఉరవకొండ (ప్రజా అమరావతి):


వజ్రకరూరు మండలం చిన్నహోతురు గ్రామంలో శనివారం 48 మంది ఎస్సీ రైతులకు ఉచితంగా విత్తన కందులను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అందజేశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకం కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున ఉచితంగా అందజేయడం మంచి శుభ పరిమాణం అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కందులను రైతులు సద్వినియోగం చేసుకొని మంచి పంటలు పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుంకులమ్మ,మండల  కన్వీనర్ హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి,దుర్గా ప్రసాద్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments