*రైతన్నలు, పారిశ్రామికవేత్తలు మా ప్రభుత్వానికి రెండు కళ్ళు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*
*ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పారిశ్రామిక పార్కులలో పర్యావరణ పరిరక్షణ*
*మీకు ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి, ప్రభుత్వం అండ ఉంటుంది*
*'మంగళగిరి పారిశ్రామిక పార్కు'ను మోడల్ పార్కుగా చేస్తాం*
*"ఐఈఐడీ" ఉద్దేశ్యాన్ని చాటేలా పోస్టర్లను ఆవిష్కరించిన ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*
*ఎవ్వరూ పైసా లంచం ఇవ్వనక్కర్లేదు..పని చేయించుకోవడం మీ హక్కు : ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు*
అమరావతి, జూలై, 05 (ప్రజా అమరావతి): రైతన్నలు, పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. అన్నం పెట్టే అన్నదాతలు, పరిశ్రమ స్థాపించి ఉపాధినందించే పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. మంగళగిరి ఐటీ పార్కులోని ఏపీఐఐసీ భవనం సమీపంలో ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. గత 15 రోజులుగా జరుగుతున్న ఈ డ్రైవ్ వల్ల ఆటోనగర్లు, పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారాయన్నారు. మునుముందు కూడా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించి పారిశ్రామిక పార్కులను ఒక నమూనాగా నిలుపుతామన్నారు. ఇటీవల రాష్ట్రంలో వరుస రోడ్ షోలు, దావోస్ పర్యటన, భూమిపూజ, శంకుస్థాపనలు, సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామిగా నిలవడం తదితర పరిణామాలతో పారిశ్రామికాభివృద్ధి మరో మలుపు తిరుతుతోందని ఛైర్మన్ స్పష్టం చేశారు. అంతకుముందు మొక్కలు నాటి ఐఈఐడీ (ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్) ని ఛైర్మన్ ప్రారంభించారు. 15 రోజుల్లో అక్కడ పారిశ్రామికవేత్తలు ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై మళ్లీ సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఆలోపు వారి కనీస వసతుల కల్పనకు అధికారులు శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. అనంతరం మంగళగిరి పారిశ్రామికవేత్తల సంఘం ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని సన్మానించారు. ఛైర్మన్ హుందాతనం, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ఆయన స్పందించే విధానాన్ని వారు మెచ్చుకున్నారు.
*ఎవ్వరూ పైసా లంచం ఇవ్వనక్కర్లేదు..పని చేయించడం మీ హక్కు : ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు*
పారిశ్రామికపార్కుల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా భావిస్తేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఏపీఐఐసీ పారదర్శకతకు పెద్దపీట వేస్తుందన్నారు. ఎవరూ మీ పనులకు పైసా చెల్లించనవసరం లేదన్నారు. లంచాలిచ్చే అవకాశమే లేకుండా ఏ సేవనైనా 15 రోజుల నుంచి 45 రోజుల గడువులోగా పూర్తి చేసే విధంగా అంతా ఆన్ లైన్ ద్వారానే 14 సేవలను అందిస్తున్నామన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరమే లేని విధంగా ఏర్పాటు చేసిన ఆన్ లైన్ సర్వీసుల వ్యవస్థను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. పారిశ్రామికవేత్తలు కూడా సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని, బిల్లుల చెల్లింపు సహా కంప్యూటర్ లోనే సేవలందుకునే విధంగా అవసరమైతే అవగాహన సదస్సులను ఏపీఐఐసీ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేస్తామని ఈడీ సుదర్శన్ బాబు స్పష్టం చేశారు. అన్ని జోనల్ మేనేజర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని, దీనిని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలకు అవగాహన కలిగించే విధంగా ఏపీఐఐసీ ఉన్నతాధికారులు కొన్ని ముఖ్య విషయాలను తమ ప్రసంగాల ద్వారా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు, ఓఎస్డీ ల్యాండ్స్ సాధన, సీజీఎం (పర్సనల్, అడ్మిన్) జ్యోతి బసు, జోనల్ మేనేజర్ గోపి క్రిష్ణ, డీజెడ్ఎం రామారావు, డీజీఎం శరత్ బాబు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment