*- దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చంద్రబాబు
*
*- ఆరోగ్య పరిరక్షణ దేంగా పనిచేస్తున్నాం*
*- న్యూట్రిఫుల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి*
*- కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్లో శిష్ట్లా లోహిత్*
గుడివాడ, జూలై 7 (ప్రజా అమరావతి): దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టిడిపి కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్
శిష్ట్లా లోహిత్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి- చంద్రన్న భరోసా పేరుతో చిత్తూరు జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. మదనపల్లెలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలో కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను శిష్ట్లా లోహిత్ వివరించారు. అనంతరం లోహిత్ మాట్లాడుతూ కార్యకర్తలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలని అభిప్రాయపడ్డారు. కార్యకర్తల సంక్షేమంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రియాశీలక కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సమతుల్య ఆహారం, వ్యాయామం, జీవన విధానాలపై అవసరమైన సూచనలను కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం న్యూట్రిఫుల్ యాప్ ను రూపొందించామని తెలిపారు. ఈ యాప్ ను కార్యకర్తలు అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. స్కాన్ చేసుకుని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని వివరించారు. మరింత సమాచారం కోసం 9188110468 ఫోన్ నెంబర్ కు వాట్సప్ చేయాలని వివరించారు. మినీ మహానాడులో భాగంగా కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్టాల్స్ లో కార్యకర్తలు తమ బయోడేటా, ఫోన్ నెంబర్ ను నమోదు చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు ఆశయ సాధనలో భాగంగా కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.
addComments
Post a Comment