జాతీయ స్థాయి లో జిల్లాకు గుర్తింపు
మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రధమం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మిషన్ డైరెక్టర్ రాసిన లేఖలో కలెక్టర్ కు ప్రశంసలు
విజయనగరం, జులై 22:(ప్రజా అమరావతి): మౌలిక వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రధమ స్థానం లభించింది. దేశం లోని 112 ఆకాంక్షల జిల్లాల (ఎస్పిరేషనల్) కు నెల వారీగా వారు సాధించిన లక్ష్యాల ఆధారంగా నీతి అయోగ్ ర్యాంకింగ్ ను ఇస్తుంది. మే నెల ర్యాంకింగ్ లో విజయనగరం జిల్లా గృహ నిర్మాణాలు, రహదారుల అభివృద్ది లో జిల్లా ప్రధమ స్థానం లో నిలిచినట్లు ఎస్పిరేషనల్ జిల్లాల ప్రోగ్రాం మిషన్ డైరెక్టర్ రాకేష్ రంజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ లో ప్రత్యేకంగా జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసారని అభినందించారు. జిల్లాలో చేపడుతున్న పేదలందరికి ఇల్లు, జగనన్న కాలనీల లో మౌలిక వసతుల కల్పన, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద వేసిన రహదారులకు ఈ ప్రశంస లభించిందని, ఇది అధికారుల సమష్టి కృషి ఫలితమని కలెక్టర్ అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి నెల ఈ రాంక్ నిలిచేలా పని చేయాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. మిగిలిన సూచీలలో కూడా ముందుండేలా పనిచేయాలని అన్నారు.
addComments
Post a Comment