లీగల్ మరియు సోషల్ కౌన్సిలర్ కావలెను.

 ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయము, మంగళగిరి (ప్రజా అమరావతి);




* ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో  కాంట్రాక్టు పద్దతిన పనిచేయుటకు లీగల్ మరియు సోషల్ కౌన్సిలర్ కావలెను. 42 ఏళ్ళ వయసు దాటని మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.‌ ఒక్కో పోస్ట్ జీతం నెలకి రూ. 28,500 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.

*లీగల్ కౌన్సిలర్ అర్హతలు:* 

 న్యాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసి, న్యాయవాదిగా ఐదేళ్లపాటు పనిచేసిన  అనుభవం కలిగినవారు, చట్టంపై పూర్తి అవగాహన ముఖ్యంగా పోలీస్ సంబధిత చట్టపరమైన విషయాలలో పరిజ్ఞానం కలిగి ఉన్నవారు అర్హులు.

* సోషల్ కౌన్సిలర్ అర్హతలు:*

 సోషియాలజీ మాస్టర్స్ డిగ్రీ లేదా సోషియాలజీ పీజీ డిప్లొమా పూర్తి చేసి  కౌన్సిలింగ్ రంగంలో మూడేళ్ళ అనుభవం, కంప్యూటర్ అవగాహన కలిగిన వారు అర్హులు.

* దరఖాస్తులు ఈనెల 04 నుంచి 14వ తేదీ వరకు అన్ లైన్లో మెయల్ ద్వారా పంపుకోవాల్సింది. దరఖాస్తులు ఈనెల 17వ తేదీన పరిశీలన జరగనున్నది. అనంతరం అభ్యర్థుల ఇంటర్వ్యూతో కౌన్సిలర్‌ గా ఎంపిక కానున్నారు.


దరఖాస్తులను apwcrecruitmentlcw22@ gmaii.com మెయిల్ కి పంపాలి.


*ఆసక్తి కలవారు 9441356482నెంబర్ లో సంప్రదించగలరు*


Comments