ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడులో వరద బాధిత గ్రామాల్లో సీఎం పర్యటన.


కన్నాయిగుట్ట, పోలవరం నియోజకవర్గం, ఏలూరు జిల్లా (ప్రజా అమరావతి);


– ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడులో వరద బాధిత గ్రామాల్లో సీఎం పర్యటన.


– కన్నాయిగుట్ట, తిరుమలాపురం గ్రామాల్లో సీఎం పర్యటన.

– చింతూరు నుంచి నేరుగా హెలికాప్టర్లో చేరుకున్న సీఎం. 

– హెలిపాడ్‌ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. 

– వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం. 

– కన్నాయిగుట్టలో అందర్నీ ఆప్యాయంగా పలకరించిన సీఎం. 

– వరద తీవ్రత, సహాయ కార్యక్రమాల్లో యంత్రాంగం పనితీరు తదితర అంశాలపై గ్రామస్తులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సీఎం. 

– కలెక్టర్‌ సహా అధికార యంత్రాంగం అంతా బాగా పనిచేశారని, గతంలో ముంపు సమయాల్లో ఎప్పుడూ కూడా ఇంతవేగంగా సహాయం అందలేదని, సహాయం అందనివారు ఒక్క కుటుంబం కూడా లేదని సీఎంకు వివరించిన గ్రామస్థులు. 

– వాలంటీర్ల పనితీరుపై ప్రశంసలు కురిపించిన గ్రామస్థులు. 

– కన్నాయిగుట్టలో వీధులకు ఇరువైపులా తనకోసం వేచి ఉన్న ప్రజలను పలకరించిన సీఎం. 

– పెన్షన్ల అందుతున్న తీరు, అమ్మ ఒడి, విద్యాకానుక తదితర అంశాలపై అదే సమయంలో ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సీఎం. 

– ఎలాంటి లోటు రాలేదని, అన్నీ చక్కగా అందుతున్నాయన్న ప్రజలు. 

– పలుచోట్ల చిన్నారులను పలకరించిన సీఎం. వారి చదువుకుంటున్న తరగతి, విద్యాకానుకద్వారా అందిన బ్యాగు, బట్టలు తదితర వాటిపై వారినుంచి వివరాలు తెలుసుకున్న సీఎం. 

– విద్యాకానుక బాగుందని సంతృప్తి వ్యక్తంచేసిన చిన్నారులు. 

– అక్కడనుంచి కాస్త దూరంలో తిరుమలాపురం వద్ద ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం.

– వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద తీవ్రత, సహాయ కార్యక్రమాలపై ఫొటోలను పరిశీలించిన సీఎం. 

– తర్వాత గోదావరి వరద తీవ్రతను స్వయంగా పరిశీలించిన సీఎం. 

– అక్కడే వరద బాధితులతో మాట్లాడిన సీఎం. వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న సీఎం. 

– ఇది ముగిసిన తర్వాత హెలికాప్టర్లో నేరుగా విజయవాడ చేరుకున్న సీఎం.

Comments