శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్ధం రెండు వాటర్ కూలర్ మరియు ఫ్యూరిఫయర్ లు (40లీ కెపాసిటీ) ( విలువ సుమారు లక్ష రూపాయలు )ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానం నకు అందజేసినారు.
అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీఅమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి గారు, సహాయ కార్యనిర్వహణాధికారి బి.వి రెడ్డి గారు, ఆలయ ఇంజినీరింగ్ అధికారులు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment