జగన్ రెడ్డి గ్యాంగ్ ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను సైతం దోచుకుంటోంది

 

జగన్ రెడ్డి గ్యాంగ్ ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను సైతం దోచుకుంటోంది



కొండల్ని తవ్వేసి చెరువులుగా మారుస్తున్నారు, చెరువల్ని లోయలుగా చేస్తున్నారు 

    

విశాఖకు మణిహారంగా ఉన్న రుషి కొండను, కాకినాడ మడఅడవుల్ని నాశనం చేశారు 


ప్రజలంతా వైసీపీ అక్రమ మైనింగ్ ని, అరాచకాల్ని ఎక్కడిక్కడ అడ్డుకోవాలి


రాష్ట్రానికి, భావి తరాలకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న ఏ ఒక్కరిని  వదలం 


- నారా చంద్రబాబు నాయుడు 

అమరావతి (ప్రజా అమరావతి);

జగన్ రెడ్డి గ్యాంగ్  ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను దోచుకుంటోందని, అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలోని కొండల్ని తవ్వేసి చెరువులుగా మారుస్తూ భవిష్యత్ తరాలకు నష్టం వాటిల్లే వ్యవహరిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ద్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...


పకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. పకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అడవి తల్లి మన జీవితానికి చాలా ముఖ్యం. అశోకుడు చెట్లు నాటాడని, చెరువులు తవ్వించారని మనం చెప్పుకుంటాం. చెట్లు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. భారత దేశానికి స్వతంత్య్రం వచ్చిన తర్వాత పరిపాలన కోసం ఐఏఏస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ను, శాంతి భద్రతల పరిరక్షణకు ఇండియన్  పోలీసు సర్వీస్, అడవుల రక్షణ కోసం ఇండియన్  ఫారెస్ట్ సర్వీస్ ను ఏర్పాటు చేశారు.  ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టానుసారం అడవులను నాశనం చేస్తే భావితరాలు ప్రమాదంలో పడతాయి, వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది. దాని వల్ల వరదలు, అకాల వర్షాలు, కరువు, కాటకాలు అన్ని వస్తాయి అందుకే అడవుల్ని కాపాడుతున్నారు. మనిషికి ఆక్సిజన్  చాలా ముఖ్యం. పిల్లలకు చిన్నప్పుటి నుంచే ఆక్సీజన్ గురించి చెప్తున్నాం. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ని విడుదల చేస్తుందని. చెట్లు పెంచడం కోసం ఎన్నో వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అడవులను కాపాడడం కోసం అటవీ శాఖను నియమించుకున్నాం. 


కానీ జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేశారు. చెట్లు నరికినా మళ్లీ పెంచగలరు కానీ కొండల్ని తవ్వేస్తే ఎలా పెంచగలం అంటూ గతంలో కోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ నేతలు  ధన దాహంతో రాష్ట్రంలోని కొండల్ని తవ్వేస్తున్నారు. విశాఖ పట్నానికి మణిహారంగా ఉన్న రుషి కొండను నాశనం చేశారు. పూర్వం రుషి కొండ పై మునులంతా తపస్సు చేశారని చెబుతుంటారు. నేవిగేషన్ లో లొకేషన్  ను చూసి విశాఖపట్నం వచ్చామని తెలుసుకొనే వారు. అలాంటి చారిత్రక కొండను స్వాహా చేశారంటే ఏమనాలి.  దీనిపై  ఎన్.జి.టి ఆర్డర్స్ ఇస్తే దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్ళే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది? ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇచ్చిన 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఒక ట్రస్టీగా పరిపాలన అందించడానికి ఇచ్చారు తప్ప రాష్ట్రాన్ని దోచుకోమని కాదు. వాతావరణంతో ఆడుకోమని కాదు. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పగలరా? ఇది ఒక్క విశాఖ సమస్య కాదు. రాష్ట్ర ప్రజల సమస్య ప్రజలంతా ఆలోచించాలి. నేను రుషికొండ వెళ్తే అక్కడ వాళ్లు చేసిన తప్పు భయపడుతుందన్న భయంతో నన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇలా మొత్తం రాష్ట్రంలో 77 చోట్ల మైనింగ్ జరుగుతోంది. ఇసుకను సైతం ఇష్ణానుసారంగా తవ్వేసి అమ్ముకుంటున్నారు. 


కర్నూలు జిల్లా బనగానపల్లెలో బ్రహ్మం గారు కాల జ్నానం రాసిన రవ్వల కొండను సైతం తవ్వేశారు. ఇది ఆయనకు ముందే తెలిసి ఉంటే నా కొండను కొట్టేసేవారని తన కాల జ్నానంలో రాసేవారేమో. బ్రహ్మంగారి జీవిత చరిత్రపై  ఎన్టీఆర్ సినిమా సైతం తీశారు. కానీ ఏ మాత్రం ఆ సెంటిమెంట్ లేకుండా రవ్వల కొండను తవ్వేయటం దుర్మార్గం.  కాకినాడలో  మడ అడవుల్ని నాశనం చేశారు. టీడీపీ హయాంలో మడ అడవుల అభివృద్దికి కృషి చేశాం. తుఫాన్లను అడ్డుకునే శక్తి మడ అడవులకు ఉంది. వాటి రక్షణకు ఒక విభాగం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ ఈ అడవుల్ని కూడా జగన్ రెడ్డి గ్యాంగ్ నాశనం చేసింది.  దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.  పోలవరం కుడికాలువ గట్టును సైతం తవ్వేశారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయలతో కాలువలు నిర్మించాం. కానీ నేడు ఆ మట్టి అంతా తవ్వేసి కాలువలకు రక్షణ లేకుండా చేశారు.  విశాఖపట్నం తూర్పుగోదావరి సరిహద్దుల్లో భారతి సిమెంట్ కోసం రూ. 15 వేల కోట్ల విలువైన లాటరైట్, బాక్సైట్ దోపిడికి పాల్పడుతున్నారు. దీనిపై మా టీడీపీ నేతలు ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే.. ఎన్జీటీ బృందం వచ్చి పరిశీలించింది, కానీ మైనింగ్ మాత్రం ఆగడం లేదు. ఇక ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి? కుప్పం శాంతిపురంలో మైనింగ్ జరిగే ప్రాంతానికి పరిశీలించేందుకు నన్ను కూడా అనుమతించలేదంటే ఎంత కండకావరం? వైసీపీ రౌడీయిజం చేయాలనుకుంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మీకు ప్రజలే మిమ్మల్ని తరిమికొట్టే పరిస్థితులొచ్చాయి. టీడీపీ హయాంలో కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో  హెర్బల్ ప్లాంట్స్, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దుంకు కృషి చేశాం. కానీ  నేడు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాఫియా నాయకుడిగా మారి చెట్లు కొట్టిస్తున్నారు. అన్ని శాటిలైట్ లో ఉన్నాయి, ఎవ్వర్నీ వదలం తప్పు చేసినవారందర్నీ కోర్టు బోను ఎక్కిస్తాం. వైసీపీ నేతల ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాం కోట్టుకుపోయి 62 మంది నిండు ప్రాణాలు పోయాయి. అక్కడ ఇంతరవకు రీహాబిలిటేషన్ ఇవ్వలేదు, ప్రాజెక్టు పునర్మాణం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదంటే ఈ అసమర్ధ ముఖ్యమంత్రిని ఏమనాలి? పొన్నూరు అనుమర్లపూడిలో అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. పోలీసులు ప్రభుత్వ ఆస్తులు రక్షిస్తారా? లేక మైనింగ్ మాఫియాకు సహకరిస్తారా?  చిత్తూరు జిల్లా బండపల్లిలో కొండను చెరువును చేశారు, కాకినాడ పెద్దాపురంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెరువును కొట్టేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో రోజుకు 300 ట్రిప్పర్ల గ్రావెల్ తరలిస్తున్నారు. కడప చలమారెడ్డి పల్లిలో కొండను మాయం చేశారు. తూ.గో జిల్లా వేమగిరి కొండల్ని చెరువుగా మార్చారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు వెళ్లిన దేవినేని ఉమాను అరెస్టు చేశారు. విజయనగరం నెల్లిమర్ల కొండలు ఆహ్లాదరకరంగా ఉంటుంది. అక్కడ ప్రయాణం చేస్తుంటే ఆహ్లాదరకంగా ఉంటుంది. జపాన్ లో కొండల్లో  సీజనల్ ప్లవర్ల్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరంగా చేశారు. అలానే ఏపీలో మాహయాంలో అత్యదికంగా గ్రీన్ కవర్లు ఏర్పాటు చేశాం. నాడు హైదరాబాద్ లో చెట్లు ఏర్పాటు చేయటం బట్టే నేడు మోస్ట్ లవిబుల్ సిటీగా ఉంది. అనంతపురం జిల్లాలో పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వేస్తున్నారు. పీలేరులో కొండల్ని చెరువులు చేశారు.  గుంటూరులో ల్యాం గ్రామంలో కొండ మెత్తం తవ్వేశారు. హైదరాబాద్ లోని కొండలు మన అమరావతికి ఉన్నాయి. ఆ కొండలన్నింటిని నాశనం చేశారు. భావి తరాల భవిష్యత్ తో ఆడుకునే హక్కు వైసీపీ ప్రభుత్వానికి  లేదు. రాష్ట్ర వ్యాప్తంగా   75 చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై పోరాటం చేసిన మా టీటీపీ నేతల్ని ఎన్నిసార్లు అరెస్టు చేసినా పోరాటం ఆపే ప్రసక్తే లేదు. 



అధికారులు వైసీపీ నేతలు చెప్పినట్టు విని భవిష్యత్ తరాలకు, రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో చర్యలు తప్పవు. గతంలో ఒక్క ఇంచు కూడా పారెస్టు భూమి ఆక్రమణకు గురికావ్వని అధికారులు నేడు ఎందుకు దాసోహం అయ్యారు? ఇండియన్ పారెస్ట్ సర్వీస్ విశిస్టత కాపాడుకుంటారా లేదా వాళ్లు సమాధానం చెప్పాలి. అక్రమ మైనింగ్ లో పారెస్ట్, మైనింగ్ రెవిన్యూ డిపార్టమెంట్లకు చెందిన అధికారులు ఎవరి హయాంలో మైనింగ్ జరిగిందో వారందరు  వీటికి  మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు తప్పుడు రికార్డులు చూపించి తప్పించుకున్నా భవిష్యత్తులో మాత్రం  ఇబ్బందులు తప్పవు. ఇది అధికారుల పై కోపంతో చెప్పటం లేదు. రాష్ట్రం మీద అభిమానంతో చెబుతున్నా. సమాజానికి చెడు చేసే వ్యక్తులతో నా పోరాటం. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అందుకే సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు విజ్నప్తి చేస్తున్నాం. డబ్బు పోయినా, ఆస్తులు పోయినా సంపాదించకుంటాం, కానీ సహజ సంపద పోతే మళ్లీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి సంపాదించలేం. భవిష్యత్తులో ప్రకృతి విలయం తాండవం చేస్తే తట్టుకునే పరిస్ధితి ఉండదు. అందుకనే వైసీపీ అక్రమ మైనింగ్ ని, అరాచకాల్ని ప్రజలు ఎక్కడిక్కడ అడ్డుకోవాలి. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం వెయ్యి లారీలు తెప్పించుకుంటారా?  అడ్డుకుంటే కేసులు పెడతారా?  మైనింగ్ ను అడ్డుకున్న వారిపై ఎక్కడిక్కడ కేసులు పెట్టి బెదిరిస్తారా? కర్నూలు జిల్లా సత్యవేడులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను అడ్డుకుని, కోర్టుకు వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెద్దిరెడ్డి అనుచరులు బెదిరించడం, పోలీసులు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మైనింగ్ జరిగేచోటుకు వెళ్లిన సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తల్ని మంత్రులు బెదిరింపులు, అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మైనింగ్ శాఖ మంత్రి ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ చేసే వ్యక్తులకు అనుమతులు ఇచ్చి, వారికి అండగా నిలుస్తున్నారు. మంత్రి ఇదే పంథాలో పోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవావాల్సి ఉంటుంది. 


సీఎన్ఓఎస్ సర్వేలో ముఖ్యమంత్రి 20వ స్థానంలోకి వెళ్లారు...ప్రజలకు ఇతని మీద కంపరం పుట్టింది. వైసీపీ దోపిడీకి అడ్డొస్తున్నామని టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయింది. రాష్ట్ర  ప్రజలు కూడా పునరాలోచించుకోవాలి. వైసీపీ ధన దాహానికి ప్రకృతిని కూడా వదలరా? మద్యంపైనా దోచుకుంటున్నారు. రాష్ట్రం మరో శ్రీలంక కాకుండా వైసీపీ దుష్ట పరిపాలన నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కలిసి పోరాడడానికి ముందుకు రావాలి. అందరం చైతన్యవంతులం అవుదాం, కలిసి పోరాడుదాం. మైనింగ్, ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యకార్యదర్శులు సమాధానం చెప్పాలి. జరిగిన ప్రతి అక్రమ మైనింగ్ ను నేను రుజువుచేస్తా. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా, లేదో చెప్పాలి? చర్యలు తీసుకోకుంటే చరిత్ర హీనులుగా మారతారు. వైసీపీ ఆటలు సాగనివ్వం. 77 చోట్ల అక్రమ మైనింగ్ ను అడ్డుకుంటాం. పకృతి సహజ వనరులను కాపాడుకుంటాం. ప్రభుత్వ అక్రమ మైనింగ్ ను తీవ్రంగా గర్హిస్తున్నాం.” అని చంద్రబాబు నాయుడు  అన్నారు.


విలేకరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇస్తూ...


 వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రలు చౌకబారు విమర్శలు చేయడానికి దిగజారిపోయారు. కొండలన్నీ మేమే తవ్వేశాం అని కూడా చెప్పడానికి వెనకాడరు. గడపగడపకు ప్రభుత్వం ఎత్తిపోయింది. వైసీపీ ప్లీనరీల్లో కుర్చీలు గాల్లో ఎగిరాయి. ప్లీనరీకి స్కూల్ బస్సులు తీసుకురావడానికి మీకేం అధికారం ఉంది, వాటికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆర్టీసీ బస్సులు వినియోగించడంలో మీకొక హక్కు, మాకొక హక్కా? ప్లీనరీకి బస్సులన్నీ తీసుకెళ్లి వైసీపీ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మా మీటింగులకు గ్రౌండ్లు ఇవ్వడం లేదు. మీ ప్లీనరీ కోసం విద్యార్థుల పరీక్షలు వాయిదా వేస్తారా? అధికారులు పూర్తిగా ప్లీనరీలో సేవలందించడానికి ఉన్నారా? అధికార దుర్వినియోగానికి వైసీపీ పరాకాష్ట. అధికారం చేతిలో ఉంది కదా అని ఏది చేస్తే అది చెల్లుతుందని అనుకుంటే చెల్లదు. బాధ్యత తీసుకున్నవాడికి ఎంతైనా పని ఉంటుంది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వ్యక్తులు దేన్నీ లెక్కపెట్టుకోరు. తిత్లీ తుఫాను వచ్చిన సమయంలో పండుగలు ఉన్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా అధికారులను పెట్టుకుని పరిస్థితులు సరిదిద్దుకున్నాం. హుద్ హుద్ సమయంలోనూ రాజమండ్రిలో బస్సులో ఉండి పరిస్థితులను చక్కదిద్దాను, రాష్ట్ర పరిపాలనను కొనసాగించాను. కానీ ఈ ప్రభుత్వానికి వర్షాలు, తుఫాన్లు, పోలవరం, అమరావతి, ప్రజలు చనిపోయినా, ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టడం లేదు. ప్రశ్నిస్తున్న మాపై కేసులు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. గోదావరి వరద కూడా ఒక్కసారిగానే రావు. కానీ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయి నేడు. ముంపు ప్రాంత బాధితులకు పునరావాసం కల్పించి, పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ప్రజలను కాపాడుకోవాలి. కానీ ఈ ప్రభుత్వానికి ఈ స్పృహ లేదు. ఈ ప్రభుత్వం కోవిడ్ నిధులు రూ.1,200కోట్లు దారి మళ్లించిందని సుప్రీం కోర్టు వాతలు పట్టే పరిస్థితి. జాతీయ విపత్తుల నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం మింగేసింది. ఈ విధానాలన్నింటినీ తీవ్రంగా గర్హిస్తున్నా. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు కష్టాలు మరిన్ని వస్తాయి. మేం అండగా ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. భద్రతలేని నాయకులకు సెక్యూరిటీ తగ్గింపు, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా పరదాలు చాటున దాక్కునే పరిస్థితి. ఇటువంటి చెడ్డ పనులు ఇలాగే కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్యాలెస్ నుండి అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండదు, గుర్తు పెట్టుకోవాలి అని హెచ్చరించారు.


విలేకరుల సమావేశం ప్రారంభానికి ముందు “వైసీపీ నాయకులు చేసిన అక్రమ మైనింగ్ పై   టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి చంద్రబాబు  ప్రారంభించారు”. జరిగిన అక్రమ మైనింగ్ ఫోటోలు చూసి వైసీపీ నేతల అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments