నెల్లూరు, జులై 18 (ప్రజా అమరావతి):-- ప్రజలను నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన అర్జీల పట్ల రాష్ట్ర అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతివారము స్పందన అర్జీల పరిష్కారం పై సమీక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 15,430 స్పందన అర్జీలు రాగా వాటిలో 11,985 అర్జీలు పరిష్కరించామన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎంతో కష్టంతో జిల్లా కేంద్రానికి అర్జీల పరిష్కారం కోసం వస్తుంటారని వారి పట్ల సహృదయంతో మెలగి తమ వంతు బాధ్యత తీసుకొని అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ముఖ్యంగా 24 లేదా 48 గంటల్లో పరిష్కారం కావాల్సిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులో పరిష్కరిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్ కూర్మానాధ్, డి ఆర్డి ఏ, హౌసింగ్, మెప్మా పీడీలు శ్రీ సాంబశివరెడ్డి, శ్రీ నరసింహం, శ్రీ రవీంద్ర, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు డిటిసి శ్రీ చందర్ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీ సురేష్ కుమార్, సర్వే రికార్డుల ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment