మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వృద్ధాప్య ఫించన్ ను అందుకుంటున్నామని వయో వృద్ధులు ఆనందంతో చేప్పారన్నారు


నెల్లూరు, జూలై 3 (ప్రజా అమరావతి);


మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతానికి పైగా పూర్తి చేసి, ఇంకా ఏమైనా ప్రజల అవసరాలు ఉన్నాయేమోనని   తెలుసుకోవటానికి ధైర్యంగా చేసే ప్రయత్నమే  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య  ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు 

శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 


ఆదివారం సాయంత్రం మనుబోలు మండలం వీరంపల్లి పంచాయితీ రాజవోలుపాడు గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి గ్రామస్తులు అడుగడుగునా సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు అందాయో లేదో తేలుసుకుంటూ ముందుకు సాగారు. రాజవోలుపాడు ఎస్ సి కాలనీలో ప్రజానేత మంత్రి కాకాణికి ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికి గ్రామం లోకి తోడ్కొని వేళ్ళారు 


అనంతరం మంత్రి  కాకాణి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలు గమనించారన్నారు. మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వృద్ధాప్య ఫించన్ ను అందుకుంటున్నామని వయో వృద్ధులు ఆనందంతో చేప్పారన్నారు


. భారతదేశంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో లక్షా యాభై వేల కోట్ల రూపాయలను ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎంతో పారదర్శకంగా, నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ఇన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గర్వంగా చెప్పగలమన్నారు. 


        ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తాహసిల్దార్ నాగరాజు, ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.



Comments