రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉంది: పరిశ్రమల శాఖ మంత్రి*రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉంది: పరిశ్రమల శాఖ మంత్రి


*


*సి ఐ ఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి*


తిరుపతి, జూలై 22 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అన్ని విధాలా  ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటుందని, ఎపి ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్ లో రెండవసారి నెంబర్ 1 గా వుందని  రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక తాజ్ హోటల్ నందు  కాన్ఫెడరేష అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సి ఐ ఐ ) సౌత్ జోనల్ సమావేశంలో రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ సి ఐ ఐ సదరన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు సంతోషమని, గౌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పరిశ్రమల అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉన్నారని అన్నారు.  దివంగత గౌతం రెడ్డి పూర్వపు పరిశ్రమల శాఖ మంత్రిని గుర్తు చేసుకుంటూ చాలా చురుకుగా పరిశ్రమలను తీసుకు వచ్చే దిశలో సఫలీకృతం అయ్యారని తెలిపారు.  సంపద సృష్టికర్తలు అయిన మీతో సి ఐ ఐ సమావేశంలో పాల్గొనడం సంతోషమని,  రాష్ట్ర, దేశ  ఆర్థిక వ్యవస్థను ప్రగతిలో నడిపించే మీ సూచనలు పాటించడం , పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రిగా మీ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. మేము ప్రారంభించిన విధానాలు ( పరిశ్రమలు , IT , MSME , EV మొదలైనవి ) అన్ని వ్యాపారానికి అనుకూలమైనవి అయినా  పారిశ్రామిక వేత్తలు  కోరినప్పుడు సవరణలకు కూడా  సిద్ధంగా వుంటామని అన్నారు. సౌర విద్యుత్ సామర్థ్యాన్ని వ్యవస్థాపించాలనే ఆదేశంతో AP గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసామని ,   నానాటికీ పెరుగుతున్న కార్గో డిమాండ్‌కు అనుగుణంగా రామాయపట్నం వద్ద గ్రీన్‌ఫీల్డ్ సీ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందేనన్నారు. దేశంలో అతి పెద్ద రెండవ సముద్రతీర ప్రాంతం,   ప్రధాన ఓడరేవులతో, దక్షిణాదికి ఎగుమతులు & లాజిస్టిక్స్ హబ్‌గా మారానున్నదని తెలిపారు. వ్యవసాయ రంగం, ఆక్వా, మత్స్య తదితర రంగాలకు పెద్ద యెత్తున ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. భోగాపురం పోర్ట్  ఏర్పాటు అందుబాటులోకి వస్తున్నదని తెలిపారు. పెట్రోకెమికల్ హబ్ గా నక్కపల్లి రాబోతున్నది అన్నారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌లో 16 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, మొత్తం 1,411 కి.మీ.ల పొడవుతో రూ.  15,592 కోట్లు ఖర్చుతో భారతమాల, సాగర మాల అధునాతన  రోడ్లతో రవాణా సౌకర్యాలు, కొత్త సముద్ర ఓడరేవులతో అందుబాటులోకి రావడంతో ఎగుమతి దారులకు  లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి లభాపడనున్నారు అని తెలిపారు. ఫార్మా పరిశ్రమకు ఆంధ్రా యూనివర్సిటీ & "విశాఖ ఫార్మాసిటీ" జాయింట్ వెంచర్ ద్వారా "అధునాతన శాస్త్ర పరిశోధన కేంద్రం" ఏర్పాటు తో   ఒక  ప్రత్యేకమైన మోడల్ గా భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఫార్మా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్‌ను ప్రారంభించామని తెలిపారు. .  రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొన్ని ప్రధాన పంటలలో వరి , మిర్చి , నూనె గింజలు , పత్తి , పప్పుధాన్యాలు మరియు శనగలు,  గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో , మాంసం, పాల ఉత్పత్తిలలో నాలుగో స్థానంలో నిలిచి   సుమారు 1.45 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తూ సముద్ర ఆహార ఎగుమతి దేశం మొత్తం విలువలో 36 % వాటా గా వుందని వివరించారు. పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, కాకినాడ- విశాఖపట్నం తీర ప్రాంతాల మధ్య ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం , కెమికల్స్ మరియు పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ( PCPIR ) ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ సహజమైన బీచ్‌లు, పవిత్ర  స్థలాలు , పచ్చని అడవులు, స్పైసి వంటకాలు మరియు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులకు  పర్యాటకం గా ప్రసిద్ధి చెంది , ఎపి  టూరిజం ట్రేడ్ ( రిజిస్ట్రేషన్ మరియు ఫెసిలిటేషన్ ) మార్గదర్శకాలు-2020 కూడా అనుసరిస్తున్నదని  అన్నారు. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ ఎపి  GST వసూళ్లు స్థిరంగా ఉండటానికి రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ  ( DBT ) పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడడమే దీనికి కారణమని తెలిపారు.  పరిశ్రమలకు సంబంధించి ఏలాంటి అంశమైనా పరిష్కారానికి, ఆహ్వానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తో సహా ,  మా పరిశ్రమల శాఖ అధికారులు  ఎప్పుడు ముందంజలో ఉండి సహకరించి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ సమావేశంలో అరవై మందికి పైగా దక్షిణాది రాష్ట్రాల ప్రారిశ్రామిక వేత్తలు భారత్ బయోటెక్ శ్రీమతి సుచిత్రా కె ఎల్లా , ఒల్వా ఎం డి కమల్ బాలి, ఫెడరల్ బ్యాంక్ ఇ డి షాలిని వారియర్ , వీల్స్ ఇండియా చైర్మన్ రామ్ , కిర్లోస్కర్ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ విజయ్ ఆర్ కిర్లోస్కర్ , హుండై మోటార్స్ డైరెక్టర్ గణేష్ మణి, టాటా హిటాచి ఎం డి సందీప్ సింగ్ , సెయింట్ గోబియన్ ఇడి పద్మకుమార్ , అమర్ రాజ్ ఎగిక్యుటివ్ వైస్ ప్రసిడెంట్ , తదితరులు వున్నారు. 


Comments