ప్రకాశం జిల్లా ఎస్పీ కి జాతీయ స్థాయి అవార్డ్

 *ప్రకాశం జిల్లా ఎస్పీ కి జాతీయ స్థాయి అవార్డ్


*


"'గవర్నెన్స్  నౌ ఇండియా పోలీస్ గోల్డ్ అవార్డ్- 2022 ''అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ,ఐపీఎస్., గారు.


నేర నియంత్రణకు చేపట్టిన జైలు రెలీజ్డ్  ట్రాకింగ్ సిస్టమ్‌ ప్రాజెక్ట్ కు జాతీయ స్థాయి గుర్తింపు.


ప్రకాశం జిల్లా పోలీస్ శాఖకు జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక  పురస్కారం అయిన గవర్నెన్స్ నౌ సంస్థ వారి 2nd ఇండియా పోలీస్ గోల్డ్ అవార్డ్- 2022  వరించింది. జిల్లా ఎస్పీ గారి తీసుకువచ్చిన Jail released tracking system ప్రాజెక్ట్  కు సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఈ అవార్డును జిల్లా ఎస్పీ గారు వర్చ్యువల్ విధానం ద్వారా స్వీకరించారు. దేశంలో పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవ చేస్తూ పోలీస్ శాఖలో మార్పులు తీసుకువస్తున్న వారిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుంది. 


 వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎస్పీ గారు ప్రాజెక్ట్  గురించి వివరిస్తూ  జైలు నుండి విడుదలైన వ్యక్తులను నిరంతరం పర్యవేక్షించడం మరియు తదనుగుణంగా స్థానిక  పోలీస్ లను మరియు CCS పోలీసులను కూడా అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ఫీల్డ్ సిబ్బంది తమ ఏరియా జైలు నుండి  విడుదలైన ఖైదీల జాబితా,  వారి సమగ్ర సమాచారం, వారు  నేరాలకు పాల్పడే  తీరు మరియు ఇతర నేరాలకు సంబంధించిన  వివరాలను ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల ఫీల్డ్ ఆఫీసర్లకు గూగుల్ లింక్‌ ద్వారా షేర్ చేయడం వారిపై నిఘా పెట్టడం జరుగుతుందని  తెలియచేసారు.  


జైలు నుంచి విడుదలైన ఖైదీల గురించి రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ డేటాను ఉపయోగించడం ద్వారా తదుపరి నేరాలను నిరోధించవచ్చునని, ఆస్తి నేరాలు మరియు ఇతర నేరాలు జరగకుండా ఈ ప్రాజెక్ట్ ఎంతోగాను ఉపయోగపడుతుందని  తెలియచేసారు. 


జిల్లా పోలీసు శాఖకు ఈ అవార్డు రావడం పట్ల ప్రకాశం జిల్లా పోలీసులు మరియు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ అవార్డు  రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,  ఈ అవార్డు ప్రకాశం జిల్లా పోలీసుల ప్రతిభకు నిదర్శనమని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఉత్సాహవంతంగా పనిచేయుటకు ఈ అవార్డులు దోహదపడుతుందని తెలియజేసినారు.

Comments