రాష్ట్రంలో రైసు మాఫియా ___ బీజేపీ ఆరోపణ__రాష్ట్రంలో రైసు మాఫియా 

___ బీజేపీ ఆరోపణ


     కాకినాడ, జూలై 15 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రైస్ మాఫియా ఆటలు, ఆగడాలు పెరిగిపోయాయని కాకినాడకు చెందిన బిజెపి నాయకులు ఆరోపించారు. ఈ మాఫియాకు పోలీసులు కూడా సహకరిస్తున్నారేమోనన్న అనుమానం తమకు మొదలైనట్లు వారు తెలిపారు.

   శుక్రవారం కాకినాడ నగరంలోని బిజెపి నగర కోఆర్డినేటర్ గట్టి సత్యనారాయణ నివాసంలో విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర బిజెపి మీడియా ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ కాకినాడలో కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఇవ్వటం లేదన్నారు. దీన్ని తాము క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పేదలు తమ దృష్టికి తీసుకు వచ్చారని, దీంతో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, డిఎస్ఓ కార్యాలయంల వద్ద ధర్నా చేయాలని ఆదేశించిదన్నారు.     

   అందుకు అనుగుణంగా తాము  ధర్నా చేస్తే పోలీసులు అడ్డుకున్నారని, అయినా తాము శాంతియుతంగా కలెక్టరేట్లో ఉన్న డిఎస్ఓ కార్యాలయంకి వెళ్ళామన్నారు. తర్వాత సాయంత్రం పోలీసులు తమపై కేసులను నమోదు చేసినట్లు చెప్పారు. 

   దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని రాష్ట్రానికి చెందిన నాయకులు దోచేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదలకు నాలుగు నెలల బియ్యం ఇవ్వమని అడుగుతున్న తమపై పోలీసులు కేసులు పెట్టడం చూస్తే ఆ మాఫియాను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని అనుమానం కలిగిందన్నారు. 

  ఈ విషయాన్ని ప్రతినెల రెండు రోజులు జిల్లాలో పర్యటించే కేంద్రమంత్రుల దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. మోడీ చేస్తున్న సేవలను చూసి రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేక పోతుందన్నారు. తక్షణమే నాలుగు నెలల కేంద్ర బియ్యంను అందించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు ఎదుర్కోవడం తను కొత్తగానే కాదని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు.

   ఈ సమావేశంలో బిజెపి నాయకులు కుండల సాయికుమార్, ముత్తా నవీన్, కొక్కిలిగడ్డ గంగాధర్, సదనాని, హరి, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Comments