ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ)
కమిషనర్ వారి కార్యాలయము, లెనిన్ సెంటర్, విజయవాడ (ప్రజా అమరావతి);
అమరావతిలో మరో మూడు ఎల్‌పీఎస్‌ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
జోన్-5లో మౌలిక వసతుల పనులను ప్రారంభించిన ఏపీసీఆర్డీఏ కమిషనర్: శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను దశల వారీగా చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధకార సంస్థ(ఏపీసీఆర్డీఏ) కమిషనర్ Sri Vivek Yadav , ఐఏఎస్ గారు పేర్కొన్నారు. భూ సమీకరణ పథకం(ఎల్‌పీఎస్)లో కేటాయించిన లే అవుట్‌ల అభివృద్ధి పనుల్లో భాగంగా మరో మూడు ఎల్‌పీఎస్ జోన్ల అభివృద్ధి పనులను సోమవారం దొండపాడు, తుళ్లూరు మరియు రాయపూడి గ్రామాలలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే జోన్-4లో అభివృద్ధి పనులు చేపట్టగా నేడు జోన్-5(బి, సి, డి)లలో దొండపాడు, తుళ్లూరు మరియు రాయపూడి గ్రామాల పరిధిలో అంతర్గత రహదార్లు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్లాట్ల అభివృద్ధిలో ప్రధాన సదుపాయాలైన రహదార్లు, వంతెనలు, తాగునీటి సరఫరా, వరద నీటి కాలవలు, మురుగునీటి కాలవల వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు(ఎస్‌టీపీ), పచ్చదనం అభివృద్ధి లాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మొత్తం నిర్మాణ పనుల అభివృద్ధి ఒప్పందాన్ని మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు చేపడుతున్నారని వివరించారు. ఏపీసీఆర్డీఏ చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులను సమీకరిచేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఇందుకు గాను సీఆర్డీఏ టౌన్షిప్‌లలోని ప్లాట్లను ఇ - వేలం ద్వారా అమ్మకాలు జరుపుతున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ఎల్‌పీఎస్ ల అభివృద్ధితో పాటు రాజధానిలో ముఖ్యమైన మౌలిక వసతులు(ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. రాజధాని ప్రధాన అనుసంధాన రహదారి(సీడ్‌యాక్సెస్‌రోడ్డు)లోని నాలుగు కూడళ్లలో తక్కిన పనులను కూడా పూర్తిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అధనపు కమిషనర్ శ్రీ అలీం భాషా గారు సీఆర్డీఏ ఛీఫ్ ఇంజినీర్లు టి. ఆంజనేయులు, సీహెచ్. ధనుంజయ, జాయింట్ డైరెక్టర్(ఓఎం) టి. చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.సాయిబాబు, ఎస్ఇలు ఎం.గణేష్‌బాబు, డి.శ్రీనివాస్, డి.వేణుగోపాల్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ పి.అజయ్, ఇఇ ఆర్.హనుమంత్‌రెడ్డి, డిఈ బి.శ్రీధర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
జోన్-5(బి)ఎల్‌పీఎస్ అభివృద్ధి పనులు ఇలా:
జోన్-5(బి) ఎల్‌పీఎస్‌లోని ప్లాట్లను అభివృద్ధి పరచేందుకు రూ.93.60 కోట్లతో రహదార్ల నిర్మాణపు పనులను సోమవారం ప్రారంభించబడును. రాజధాని బృహత్తర ప్రణాళికలో భాగంగా 5బి ఎల్‌పీఎస్‌లో చేపట్టిన పనుల వలన 1130.60 ఎకరాలలో మొత్తం 3417 ప్లాట్లకు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది.
విశాలమైన రహదార్ల అభివృద్ధి:
1. 25 మీటర్ల వెడల్పుతో 9.730 కిలోమీటర్ల రెండు లేన్ల బీటీ రోడ్లు.
2. 17 మీటర్ల వెడల్పుతో 15.360 కిలోమీటర్ల మేర రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణం.
3. 15.6 మీటర్ల వెడల్పుతో 14.900 కిలోమీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్లు.
4. 12 మీటర్ల వెడల్పుతో 4.360 కిలో మీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణాలు కలిపి మొత్తం = 44.35 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణపు పనులు జరుగుతాయని కమిషనర్ Sri Vivek Yadav గారు వెల్లడించారు. రహదార్లతో పాటు వరద నీటిపారుదల కాలవలు - 80.236 కిలోమీటర్ల మేర, తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం - 82.164 కిలోమీటర్ల మేర, వ్యర్థ నీటి కాలవలు - 33.156 కిలో మీటర్ల మేర నిర్మాణాలు జరుగుతాయి.
జోన్-5(సి)ఎల్‌పీఎస్ అభివృద్ధి పనులు ఇలా:
జోన్-5(సి) ఎల్‌పీఎస్‌లోని ప్లాట్లను అభివృద్ధి పరచేందుకు రూ. 110.01 కోట్లతో రహదార్ల నిర్మాణపు పనులను సోమవారం ప్రారంభించబడును. రాజధాని బృహత్తర ప్రణాళికలో భాగంగా 5సి ఎల్‌పీఎస్‌లో చేపట్టిన పనుల వలన 1102.49 ఎకరాలలో మొత్తం 2668 ప్లాట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది.
విశాలమైన రహదార్ల అభివృద్ధి:
1. 25 మీటర్ల వెడల్పుతో 11.260 కిలోమీటర్ల రెండు లేన్ల బీటీ రోడ్లు.
2. 17 మీటర్ల వెడల్పుతో 24.120 కిలోమీటర్ల మేర రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణం.
3. 15.6 మీటర్ల వెడల్పుతో 10.020 కిలోమీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్లు.
4. 12 మీటర్ల వెడల్పుతో 5.740 కిలో మీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణాలు కలిపి మొత్తం = 51.14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణపు పనులు జరుగుతాయని కమిషనర్ Sri Vivek Yadav గారు వెల్లడించారు. రహదార్లతో పాటు వరద నీటిపారుదల కాలవలు - 93.885 కిలోమీటర్ల మేర, తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం - 92.022 కిలోమీటర్ల మేర, వ్యర్థ నీటి కాలవలు - 37.374 కిలో మీటర్ల మేర నిర్మాణాలు జరుగుతాయి.
జోన్-5(డి)ఎల్‌పీఎస్ అభివృద్ధి పనులు ఇలా:
జోన్-5(డి) ఎల్‌పీఎస్‌లోని ప్లాట్లను అభివృద్ధి పరచేందుకు రూ. 91.60 కోట్లతో రహదార్ల నిర్మాణపు పనులను సోమవారం ప్రారంభించబడును. రాజధాని బృహత్తర ప్రణాళికలో భాగంగా 5డి ఎల్‌పీఎస్‌లో చేపట్టిన పనుల వలన 1159.28 ఎకరాలలో మొత్తం 1585 ప్లాట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది.
విశాలమైన రహదార్ల అభివృద్ధి:
1. 25 మీటర్ల వెడల్పుతో 9.300 కిలోమీటర్ల రెండు లేన్ల బీటీ రోడ్లు.
2. 17 మీటర్ల వెడల్పుతో 17.270 కిలోమీటర్ల మేర రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణం.
3. 15.6 మీటర్ల వెడల్పుతో 10.840 కిలోమీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్లు.
4. 12 మీటర్ల వెడల్పుతో 0.00 కిలో మీటర్ల రెండు లేన్ల సీసీ రోడ్ల నిర్మాణాలు కలిపి మొత్తం = 37.41 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణపు పనులు జరుగుతాయని కమిషనర్ Sri Vivek Yadav గారు వెల్లడించారు. రహదార్లతో పాటు వరద నీటిపారుదల కాలవలు - 69.38 కిలోమీటర్ల మేర, తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం - 68.69 కిలోమీటర్ల మేర, వ్యర్థ నీటి కాలవలు - 25.02 కిలో మీటర్ల మేర నిర్మాణాలు జరుగుతాయి.
addComments
Post a Comment