దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటుచేసినందుకుసియం జగన్ కు ధన్యవాదాలు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*దివ్యాంగుల విభాగాన్ని  ఏర్పాటుచేసినందుకుసియం జగన్ కు ధన్యవాదాలు


*


*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్* 


రాష్ట్రంలో దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసిన

ముఖ్యమంత్రి జగన్ మోహన్

రెడ్డికి ధన్యవాదాలు తెలుపు తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ అన్నారు.మంగళవారం తాడేపల్లి బైపాస్ రోడ్డులోని

మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్రంలోని దివ్యాంగుల నాయకుల సమావేశం బందెల కిరణ్ రాజ్

ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా కిరణ్ రాజ్ మాట్లాడుతూ 7 వ తేదిన జరిగే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ విజయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సుమారు 200 మూడు చక్రాల మోటార్ వాహనలతో ప్లీనరీకి సంఘీభావం తెలిపేందుకు జగనన్న సైన్యంలో దివ్యాంగుల

సైతం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీలు, జిల్లా

కమిటీలు నియోజకవర్గ కమిటీలు పెద్దల యొక్క సూచనలమేరకునిర్వహించ

బోతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు పాల్గొన్నారు.

Comments