జేఆర్ పుష్పరాజ్ మృతి పట్ల శిష్ట్లా లోహిత్ సంతాపం

 


*- జేఆర్ పుష్పరాజ్ మృతి పట్ల శిష్ట్లా లోహిత్ సంతాపం* 


గుడివాడ, జులై 28 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పుష్పరాజ్ మరణంతో తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని అన్నారు. పార్టీ అధిష్టానం ఏ పదవి అప్పగించినా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. పుష్పరాజ్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని అభిప్రాయపడ్డారు. పుష్పరాజ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పుష్పరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని శిష్ట్లా లోహిత్ భగవంతుడిని ప్రార్థించారు.

Comments