జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల ప్రజలు నూటికి నూరు మార్కులు వేశారు

 

నెల్లూరు జూలై 26 (ప్రజా అమరావతి);


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుత స్పందన లభిస్తుందని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల ప్రజలు నూటికి నూరు మార్కులు వేశార


ని  రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 


మంగళవారం సాయంత్రం వెంకటాచలం గ్రామంలోని  ఇందిరమ్మ ఎస్ టి కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రికి మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికి, ప్రభుత్వ పధకాలు అన్నీ తమకు అందుతున్నాయని ఆనందంతో తెలియజేశారు. 


అనంతరం మంత్రి కాకాణి మీడియా తో మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్ళి, ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రభుత్వ పధకాలు అందుతున్న వైనం తెలుసుకుని, అందని వారికి అందించాలనే లక్ష్యంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.  అర్హులకు అన్యాయం చేయకుండా, అనర్హులను అందలం ఎక్కించకుందా ప్రతి ప్రభుత్వ పథకాన్నీ అత్యంత పారదర్శకంగా, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అందిస్తున్నామన్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జన నీరాజనాలతో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నీరుగార్చారని కోన్ని దుష్టశక్తులు అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయన్నారు. కానీ సాధారణ ప్రజానీకం ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతున్నారన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మరింత మెరుగైన పాలన అందించేందుకు రాబోయే రోజుల్లో  నియోజకవర్గమంతా విస్తృతంగా తిరిగి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. 


ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎంపీడీవో  సుస్మిత రెడ్డి,  తహశీల్దార్ నాగరాజు, వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Comments