ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో పలు పధకాలు-లక్ష్యాల మానిటర్ పై సిఎస్ సమీక్ష

 ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో పలు పధకాలు-లక్ష్యాల మానిటర్ పై సిఎస్ సమీక్ష


అమరావతి,7 జూలై (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వివిధ పధకాల అమలు ఆన్లైన్ అప్లికేషన్ విధానంలో ప్రత్యేక యాప్ ల ద్వారా నిరంతరం మానిటర్ చేసేందుకు ఉద్దేశించిన కన్సిస్టెంట్ రిధమ్స్ అంశాలపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు,ఆరోగ్యం,మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి మహిళలు,బాలికలకు చెందిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు,పోస్టు కోవిడ్,ప్రజారోగ్యం,ఆసుపత్రులు, విపత్తుల నిర్వహణ,ధరల పర్యవేక్షణ,ఇంటర్వెన్షన్,పట్టణ,గ్రామీణ పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పర్యవేక్షించే అంశాలకు సంబంధించి సిఎస్ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ సంబంధిత శాఖలవారీగా ఎస్ఓపి (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)మాన్యువల్ ను రూపొందించాలని ఆదేశించారు.చిన్నారుల్లో పౌష్టికాహార లోప నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎఎన్ఎం స్థాయిలో పలు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో వివిధ అంశాలపై సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.

ఈసమావేశంలో ఆర్టీజిఎస్ సిఇఒతో పాటు ఇంకా పలువురు అధికారులు వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.

      

Comments