యువతను సన్మార్గంలో నడిపించడానికిఅఖిలభారత యువజన సమాఖ్య దోహదపడుతుంది

 మంగళగిరి (ప్రజా అమరావతి);


 *యువతను సన్మార్గంలో నడిపించడానికిఅఖిలభారత యువజన సమాఖ్య దోహదపడుతుంది


*


మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని (వేములపల్లి శ్రీ కృష్ణ భవన్) సిపిఐ పార్టీ కార్యాలయంలో

ఆదివారం జాలాది నవీన్ అధ్యక్షతన (AIYF)అఖిల

భారత యువజన సమాక్య నియోజకవర్గ మహాసభ జరిగింది.ఈమహాసభకు

ముఖ్య అతిధుతులుగా

AIYF జిల్లా అధ్యక్షులు మహమ్మద్ వలి,కార్యదర్శి

 జంగాల చైతన్య పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ ఎంతో మంది మేధావులు అఖిలభారత యువజన సమాక్యలో

పని చేసారని అన్నారు.యువతను సన్మార్గంలో నడిపించడానికి

బానిస సంకెళ్లతో  మగ్గిపోతున్నటువంటి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఈ యువజన సమాఖ్య  ఎంతో దోహదపడిందని అన్నారు,

అనంతరం మంగళగిరి నియోజకవర్గ (AIYF) అఖిల భారత యువజన సమాఖ్య

ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా జాలాది నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా బాపనపల్లి మల్లేశ్వరరావు, కార్యదర్శిగా ఇండూరి గోపి,సహాయ కార్యదర్శిగా కంచర్ల మణికంఠ,

కోశాధికారి కంచర్ల క్రాంతి,సభ్యులు,ఉయ్యాల నరసింహారావు,బాజీ, కాకర్ల నరసింహారావు, హనోక్.ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య,

మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Comments