సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌ ద్వారా సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ: కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీజీపీ

 

 

*సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌ ద్వారా సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థ: కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీజీపీ


*

మంగళగిరి (ప్రజా అమరావతి)

నూతనంగా ఏర్పడిన కొత్త జిల్లాలలోని పోలీసు కార్యాలయాలు/ పోలీసు స్టేషన్లలో మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా నూతన జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో, అనంతపురం లో  పర్యటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS గారు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు, వ్యక్తులకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర పోలీసు శాఖ విజయవాడ లో సైబర్‌ నేరాల పరిశోధనలో కీలకమైన సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తుంది. సైబర్‌ డేటా అనలిటికల్‌ సెంటర్‌తో రాష్ట్రం లోని అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు అన్ని పోలీస్ యూనిట్లకు USER ID, password ను ఏర్పాటు చేసి అందించే  ప్రక్రియ కొనసాగుతుంది. వీటి ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన డేటా సెంటర్‌ నుండి కావల్సిన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పటికే  జిల్లాస్థాయిలో పోలీసు అధికారులకు సైబర్‌ నేరాల పరిశోధనలో శిక్షణ అందిస్తున్నాం. ఈ విధానం ద్వారా సైబర్‌ నేరాల పరిశోధన వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందుతుంది.


శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని  పోలీసు హెడ్ క్వార్టర్స్, జిల్లా పోలీసు కార్యాలయం, పరేడ్ మైదానం, జిల్లా ఎస్పీ గారి రెసిడెన్స్, తదితర కార్యాలయాలను పరిశీలించారు. కొత్త జిల్లాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు... పోలీసు వ్యవస్థ సక్రమ నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలపై ఆరా తీసి మరిన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కీలక కేసులను సమీక్షించి దిశానిర్ధేశం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యలపై త్వరితగతిన స్పందన, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల కట్టడికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర డిజిపి గారితో పాటు అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్  IPS గారు, ఉమ్మడి జిల్లాల ఎస్పీలు డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు, రాహుల్ దేవ్ సింగ్ IPS గారు ఉన్నారు.

Comments