గృహ నిర్మాణంలో సరైన పురోగతి చూపించకపోతే క్రమశిక్షణ చర్యలు

 


నెల్లూరు, జూలై 1 (ప్రజా అమరావతి):--- వచ్చే ఆగస్టు నెల కల్లా గృహ నిర్మాణంలో సరైన పురోగతి చూపించకపోతే క్రమశిక్షణ చర్యలు


తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివప్రసాద్ క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరించారు.


శుక్రవారం సాయంత్రం నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబుతో కలిసి " నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు " కార్యక్రమం అమలుపై ఇంజనీరింగ్ సహాయకులు, సౌకర్యాల కార్యదర్శులు, గృహ నిర్మాణ సంస్థ క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ మండలాల వారీగా గ్రామ వార్డు సచివాలయాల వారీగా గృహ నిర్మాణాల పురోగతిపై బ్యాచుల వారీగా లక్ష్యాలు- సాధించిన పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు.   సరైన పురోగతి లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. జిల్లాలో 58,070 ఇల్లు మంజూరు కాగా 55,279 ఇళ్ళ నిర్మాణం ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు.  ఇంకా 2791 ఇల్లు నిర్మాణం మొదలు కాలేదన్నారు.  నీటి సరఫరా, భూమి చదును వంటి సమస్యలు లేకున్నా సరైన పురోగతి లేకపోవడం విచారకరమన్నారు.  ఇకనైనా అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి సరైన పురోగతి సాధించాలన్నారు.  లేకుంటే మంజూరైన ఇల్లు సెప్టెంబర్ మాసంలోగా ఇళ్ల నిర్మాణం పనులు మొదలుకాకుంటే రద్దు అవుతాయని గుర్తుంచుకోవాలన్నారు.  వచ్చే ఆగస్టు నెలలో మరల సమీక్షించడం జరుగుతుందని ఆలోగా సరైన పురోగతి లేకుంటే బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఎక్కడైనా లేఔట్ లో ఒక మంచినీటి బోరు వేస్తే గృహ నిర్మాణ పనులు మొదలవుతాయి అంటే అందుకోసం జిల్లా కలెక్టర్ వద్ద కోటి రూపాయలు సిద్ధంగా ఉన్నాయని ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


తదనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రతి రోజు గృహ నిర్మాణంపై సమీక్షిస్తున్నారని, సరిగా పురోగతి లేకపోవడంతో రాష్ట్ర కార్యాలయం నుండి సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ ను జిల్లాకు పంపించడం జరిగిందన్నారు.  ప్రతి ఒక్కరు తక్షణమే స్పందించి మంచి పురోగతి సాధించడానికి కృషి చేయాలన్నారు. లేని పక్షంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.  సచివాలయాలు యూనిట్ గా తీసుకొని పరిశీలిస్తే మూడు శాతం పనులే జరిగాయని ఇకపై లక్ష్యం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పనుల బిల్లులు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇసుక, సిమెంటు,స్టీలుతో పాటు  నీరు, విద్యుత్తు సదుపాయాలు లేఔట్ లో ఇప్పటికే కల్పించడం జరిగిందన్నారు. ఆగస్టులోగా మంచి పురోగతి సాధించేందుకు అవకాశం ఉందన్నారు.  మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు  అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.  సచివాలయాల వారీగా రోజువారి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎప్పటికప్పుడు సాధించిన ఫలితాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ వహించి సొంత కార్యక్రమంలాగా భావించాలన్నారు.  ఇంకా మొదలుకాని ఇ ళ్ళ నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఆ తర్వాతి దశల్లోకి వచ్చే 60 రోజుల్లో  తప్పనిసరిగా చేరుకోవాలన్నారు.  ప్రతి యూనిట్ను ప్రతిరోజు సంబంధిత లబ్ధిదారులను సంప్రదించి పురోగతికి కృషి చేయాలన్నారు. అలాగే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు అనుసంధానం ఎప్పటికప్పుడు చేయాలన్నారు.


ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పి డి శ్రీ నరసింహ,  గృహ నిర్మాణ సంస్థ ఏ ఈలు, డి ఈ లు గ్రామ వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.


Comments