పర్యాటకులను ఆకట్టుకున్న పూలమొక్కల ప్రదర్శన శిల్పారామంలో పర్యాటకుల సందడి

 

పర్యాటకులను ఆకట్టుకున్న పూలమొక్కల ప్రదర్శన

 శిల్పారామంలో  పర్యాటకుల సందడి



విజయనగరం, జూలై 03 (ప్రజా అమరావతి):: శిల్పారామం లో పర్యాటకుల కోలాహలం తో  ఆదివారం సందడి నెలకొంది. కడియం నుండి తీసుకువచ్చిన పలు రకాల గులాబీ, మందార మొక్కలు, అలంకరణ మొక్కల ప్రదర్శనను పర్యాటకులు సందర్శించి కొనుగోలు చేసుకున్నారు. పళ్ళ మొక్కలైన జామ, మామిడి, సపోటా, స్వీట్  నారింజ, ఉసిరి, నిమ్మ తదితర మేలు జాతి మొక్కలను పర్యాటకులు కొనుగోలు చేశారు.  డి.ఆర్.డి.ఏ, మెప్మా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్  సందర్శకులను ఆకర్శించాయి.  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరు పొసే యంత్ర పరికరాలు, కలుపు తీసే పవర్ వీడర్లను ప్రదర్శన లో  ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ శివలలిత నాటక కళాశాల ఆధ్వర్యం లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమాలను పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఆర్.టి.సి రీజినల్   మేనేజర్ , నాబార్డ్ డిడి,    ఇతర శాఖల అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్య లో హాజరైనారు.

Comments