వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాదికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);జన్మనిస్తూ ఏ తల్లీ మరణించరాదని అందుకు గర్భవతి సమయంలో అందించ వలసిన అన్ని రకాల వైద్య  సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాదికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాల


ని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు  పేర్కొన్నారు. 


శుక్రవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, వైద్యాధికారులతో సమావేశమై మెటర్నల్ డెత్ రివ్యూ   కమిటీ సమావేశాన్ని నిర్వహించి,    రెండు మాతృ మరణాల పై సంబందిత డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్షించారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సేవల ద్వారా నివారించ దగ్గ అన్ని రకాల మాతృ మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికల ద్వారా మాతృ మరణాలు జరగ కుండా చూడాలన్నారు. గర్భ వతుల ఎడల నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించరాదని అలాగే ఈ.డి.డి (ఎక్స్ పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భవతులందరికి స్కానింగ్ మరియు ఈ.సి.జి లు నిర్వహించి లోపాలను సరిదిద్ది సురక్షిత కాన్పు జరిగేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు.


ఈ సమావేశంలో డి.యం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య,  డెమో డా శ్రీనివాస రావు,  డాక్టర్లు, వైద్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. 


Comments