జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయాలి


నెల్లూరు (ప్రజా అమరావతి)!


నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేయాల


ని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్. చక్రధర్ బాబు, గృహ నిర్మాణ శాఖ  అధికారులను  ఆదేశించారు.


శనివారం నెల్లూరు నగర పరిధిలోని గుండ్లపాలెంలో జగనన్న లే అవుట్ ను,  అంబాపురం  జగనన్న కాలనీలో   చేపట్టిన  ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు పరిశీలించి, ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  తొలుత జిల్లా కలెక్టర్,  గుండ్లపాలెం  వద్ద జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి,  ఈ లే అవుట్ లో ఎన్ని ప్లాట్లు, ఎంతమంది  లబ్ధిదారులు, ఎన్ని ఇల్లు ప్రారంభించారు, అవి ఏ దశలో వున్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లే అవుట్ లో మొత్తం 310 ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని,  అందులో బిలో బేస్మెంట్ స్థాయిలో 170, బేస్మెంట్ స్థాయిలో 82, రూఫ్ లెవెల్ లో 10, స్లాబ్ వేసినవి 17, పూర్తి కాబడినవి 15 గృహాలు  కాగా మొత్తం 294  గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని  గృహనిర్మాణ శాఖ డి.ఈ,  జిల్లా కలెక్టర్ కు వివరించారు. వివిధ దశల్లో వున్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను, కలెక్టర్ ఆదేశించారు.ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలను అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి  ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు.  ఈ లేఅవుట్ లో విద్యుత్ కనెక్షన్లు, రోడ్ల నిర్మాణం చేపడితే  త్వరగా ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం వుంటుందని, విద్యుత్  సౌకర్యం  లేనందున  ఇల్లు నిర్మించుకునేందుకు చాలా ఇబ్బందిగా వుందని  లబ్ధిదారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది.  జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, విద్యుత్ కనెక్షన్లు త్వరగా ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే  లే అవుట్ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.  


అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, నగర పరిధిలోని   అంబాపురం జగనన్న కాలనీల్లో  చేపట్టిన  ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయుటకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్,  గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ  అధికారులను ఆదేశించారు.  సచివాలయం వారీగా కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని,  వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే  సహించేది లేదని,  అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. 


జిల్లా కలెక్టర్ గారి వెంట హౌసింగ్ ఈ.ఈ శ్రీ నాగరాజు, డి.ఈ శ్రీ శ్రీహరి గోపాల్,  తహసీల్దార్ శ్రీ వెంకటేశ్వర్లు,,  హౌసింగ్, విద్యుత్ శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments