ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ




*ఏపీలో వ్యవసాయ రంగంలో చేపడుతున్నకార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ* 

*ఇ–క్రాపింగ్‌ విధానం అత్యంత వినూత్నమైది*

*ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది*

*ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ విషయలోనూ ఏపీ స్ఫూర్తిదాయకం*

*ముఖ్యమంత్రికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రశంసలు*


*రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన *

*సీఎం సూచనలమేరకు మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు*


అమరావతి (ప్రజా అమరావతి);:

– రాష్ట్రంలో పంటల బీమా పథకంలోకి ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన

– రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఉండాలంటూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ విజ్ఞప్తి మేరకు ఫసల్‌ బీమా యోజనలో మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు

– క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, న్యూఢిల్లీ నుంచి పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్, ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు.

– కేంద్ర బృందం రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి సూచనల మేరకు ఫసల్‌ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ

– ప్రకటించిన పంటల్లో రైతులందరికీ కూడా ఫసల్‌ బీమా వర్తించేలా మార్పులు.

– ఇ–క్రాప్‌ వివరాలతో బీమా పథకానికి అనుసంధానించే విధానం.

– వ్యవసాయ పద్ధతులు ఆధారంగా డేటా ఎంట్రీ చేసే విషయంలో సౌలభ్యతను తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ.

– యూనివర్సల్‌ కవరేజీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ. 


వర్చువల్‌ సమావేశంలో కేంద్రమంత్రితో సీఎం ఏమన్నారంటే:


– ఫసల్‌ బీమా యోజన అందరికీ వర్తింపు చేయాలంటే విధానపరంగా మార్పు రావాల్సి ఉంది:

– ప్రస్తుతం రాష్ట్రంలో 10,444 ఆర్బీకేలు ఉన్నాయి:

– ప్రతి గ్రామంలో వ్యవసాయ కార్యక్రమాలన్నీ ఆర్బీకేల పరిధిలో జరుగుతాయి:

– అగ్రికల్చర్‌ అసిస్టెంట్, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లు ఆర్బీకేల్లో పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాలతో కలిసి ఆర్బీకేలు పనిచేస్తున్నాయి:

– రైతులు సాగుచేసిన ప్రతి పంటను కూడా జియో ట్యాగింగ్‌తో ఇ–క్రాప్‌ చేస్తున్నాం, రియల్‌ టైం డేటా ఇది:

– చాలా దృఢమైన వ్యవస్థ ద్వారా డేటాను సేకరిస్తున్నాం:

– అందుబాటులో ఉన్న ఇ– క్రాప్‌ డేటాను వినియోగించుకోవాలి:

– రైతు సాగుచేస్తున్న ప్రతి పంటకూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాం:

–రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిందే కాదు, రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది:

– మూడింతల్లో ఒక వంతు రైతులు చెల్లించాల్సిన దాన్ని, మరో వంతు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను మొత్తంగా మూడొంతుల్లో రెండొతులు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది: 

– పరిస్థితి ఇలా ఉన్నా కూడా, అందరికీ పంట బీమా పరిహారం అందాలనే లక్ష్యంతో ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది:

– లేకపోతే సాగుచేస్తున్న ప్రతి రైతు కూడా పంటలబీమా పరిధిలోకి రారు:

–ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించడం ద్వారా, రైతు సాగుచేసిన ప్రతి పంటనూ ఇ–క్రాపింగ్‌ చేయడంద్వారా ఉచిత పంటలబీమా పథకం అద్భుతంగా ముందుకు సాగుతుంది:

– సన్న, చిన్నకారు రైతులు తరఫున చెల్లించాల్సిన ప్రీమియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటి భరిస్తే, మరిన్ని అద్భుతాలు జరుగుతాయి:

– ఈ ఆలోచనపై దృష్టిసారించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరుతున్నాను:

– ఫసల్‌బీమాయోజనలో కొన్ని రాష్ట్రాలు ఎందుకు లేవన్న అంశంపై దృష్టిపెట్టి, ఆమేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు కృషిచేసిన కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను:

– ఇందులో ఉన్న సమస్యలను పరిష్కరించనడానికి కేంద్రమంత్రి చేసిన కృషిని అభినందిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను:


వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్‌ తొమర్‌ ఏమన్నారంటే..:

– ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మతో పాటు, ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర అధికారులందరికీ స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనలో తిరిగి భాగస్వాములవుతున్నందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాగతం పలుకుతున్నాను.

– రైతులు.. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడడంలో కేంద్రంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరూ ఒకే లక్ష్యంతో పని చేస్తున్నారు. రైతులకు మేలు చేయడంలో కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. అవి రైతులకు కచ్చితంగా లాభిస్తున్నాయి.

– మనందరికి తెలుసు. వ్యవసాయం బాగుండి, రైతుల ఆదాయం పెరిగితే, ఇటు దేశంతో పాటు, ఇటు రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అందుకే ఆ దిశలో కేంద్రం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి.

– రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రకటించినప్పుడు, అన్ని రాష్ట్రాలు అందులో భాగస్వామ్యం అయ్యాయి. అయితే ఏదైనా కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు, కొన్ని లోటుపాట్లు ఎదురవుతాయి. సమస్యలూ వస్తాయి. ఆ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, సలహాల మేరకు ఫసల్‌ బీమా యోజనలో అవసరమైన మార్పులు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో రాష్ట్రాల అధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖ కూడా నిరంతరం సంప్రదింపులు జరిపింది. నేను కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడడం జరిగింది. దాని పర్యవసానమే ఇవాళ్టి శుభదినం. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరిగి భాగస్వామ్యం అవుతోంది.

– రాష్ట్రంలో వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంగా, ఇక్కడ అమలు చేస్తున్న ఈ–క్రాప్‌ విధానం గురించి తెలిసింది. అది దేశంలోనే ఒక వినూత్న ప్రక్రియ. దాని గురించి తెలుసుకున్న తర్వాత, అది రైతులకు ఏ స్థాయిలో మేలు చేస్తుందన్నది అర్థం చేసుకున్న తర్వాత ఎంతో సంతోషం కలిగింది. ఎక్కడైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తే, అది మిగతా చోట్ల (రాష్ట్రాల్లో) కూడా అమలు చేయడం అవసరం. త్వరలోనే రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రుల సమావేశం నిర్వహించబోతున్నాం. రైతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ–క్రాప్‌ విధానంతో పాటు, వినూత్న కార్యక్రమాలు, పథకాలను ఆ సమావేశంలో వివరిస్తాము. అవి అన్ని రాష్ట్రాలకు ఎంతో ప్రేరణనిస్తాయి. 

– నేచురల్‌ ఫార్మింగ్, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్‌ ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోంది. రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ఇక్కడ వారికి ఎంతో మేలు చేస్తున్నాయి..

– ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేయనున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన రైతులకు తప్పనిసరిగా ఒక రక్షణ కవచంలా నిలస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం కలిగినా, రైతులకు ఈ పథకం ఎంతో అండగా నిలుస్తుంది. 

– ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో తిరిగి భాగం అవుతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ స్వాగతం పలుకుతున్నాను.

Comments
Popular posts
దొంగతనం కేసును చేదించి ముద్దాయిలను పట్టుకున్న రూరల్ సీఐ,. ఎస్ఐ
Image
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా వుంటూ, ఆధునిక సాంకేతిక పద్దతులు, పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది.
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
*ఊర పంది మాంసం ను, అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతున్న ముఠా అరెస్ట్* గోదావరిఖని : కొంత కాలంగా కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఊర పంది మాంసంను అడవిలో తిరిగే జింక, దుప్పి, అడవి పంది మాంసంగా నమ్మిస్తూ, జింక, దుప్పి, అడవి పంది లను వెటాడి చంపినట్లుగా ఫోటోలను వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ ప్రజలను నమ్మించి, అదిక ధరలకు అమ్ముతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న వారిని గుర్తించి, వారిపైన నిఘా పెట్టి ఈరోజు శాంతినగర్, పెద్దపల్లి లో ఊర పంది మాంసంను అడవి జంతువుల మాంసంగా నమ్మిస్తూ అమ్ముతుండగా, *1) లోకిని అంజయ్య S/o ఎల్లయ్య, 37 సం, ఎరుకల r/o హన్మంతునిపేట్,* *2) రేవెల్లి సంపత్ S/o పీసరయ్య, 32 సం, ఎరుకల r/o వద్కాపూర్* అను ఇద్దరినిఅరెస్ట్ చేయడం జరిగినది. *ఇంకా వీరి ముఠా సభ్యులు అయిన* *1) లోకిని జంపయ్య r/o హన్మంతునిపేట్,* *2) లోకిని గణేష్ r/o హన్మంతునిపేట్,* *3) లోకిని అనిల్ r/o నిమ్మనపల్లి,* *4) రేవెల్లి శివాజీ r/o వడ్కపూర్,* *5) కుర్ర తిరుపతి r/o పెద్దకాల్వల* *6) కెదిరి తిరుపతి r/o పెద్దపల్లి* పరారిలో వున్నారు. వీరివద్దనుండి *1) 20 కిలోల ఊర పంది మాంసం* *2) 4 కత్తులు,* *3) మటన్ కొట్టె మొద్దుకర్ర* *4) తరాజు, బాట్లు* *5) AP-15-P-120 హీరో హోండా ప్యాషన్ మోటర్ సైకిల్ స్వాదీనం చేసుకోనైనది.* ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన, ఏ.ప్రదీప్ కుమార్, సి ఐ. పెద్దపల్లి, కె.రాజేష్, ఎస్సై పెద్దపల్లి, కానిస్టేబుల్లు మాడిశెట్టి రమేష్, దుబాసి రమేష్ లను డి సి పి పెద్దపల్లి అభినందించారు.
Image
అవినీతి అనకొండగా మారిన దుర్గగుడి ఈవో • వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో రూ. 2 కోట్ల బిల్లులు • సీవేజ్ ప్లాంట్ పేరు చెప్పి రూ. 53 లక్షల దోపిడి • ఫుట్ పాత్ పేరు చెప్పి రూ. 10 లక్షల బిల్లు • నిత్య ఆదాయవనరుగా మారిన మహామండపం • ఈవో అక్రమాల్లో మంత్రి వెల్లంపల్లికీ భాగస్వామ్యం • అవినీతికి సహకరించలేదనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు • మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం సాక్షిగా కోట్లది రూపాయిల అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వినియోగంలో ఉన్న లిఫ్టులను చూపి అడ్డంగా రూ. 2 కోట్ల 28 లక్షల రూపాయిలు దోచేశారని ఆరోపించారు. ఈవో సురేష్ బాబు గారు అవినీతి అనకొండలా తయారయ్యారనీ, ఆయన అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఈవోను కొనసాగిస్తున్నారనీ అన్నారు. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలోనే ఆదాయంలో రెండో అతిపెద్ద ఆలయం అయిన కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఈవోలుగా పని చేసిన ఎంతో మంది ఐఎఎస్ అధికారులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచారు. ప్రస్తుత ఈవో సురేష్ బాబు గారికి కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఎందుకు కొనసాగిస్తున్నారో మంత్రి గారికీ, దేవాదాయ శాఖ కమిషనర్ గారికే తెలియాలి. ఈవో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి బినామీగా మారారనీ, ఏ రోజు వాటా ఆ రోజు మంత్రి గారికి అందచేయడం వల్లే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. సురేష్ బాబు గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. అమ్మవారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కోట్లాది రూపాయిల పనులకు అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. కూతవేటు దూరంలో కమిషనర్ కార్యాలయం ఉన్నా పర్యవేక్షణ కరువయ్యింది. కోట్లాది రూపాయిలు చెల్లిస్తుంటే కనీస తనిఖీలు, ఆడిట్ లు ఎందుకు చేయడం లేదు. ఆలయ ప్రాంగణంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదు. ప్రతి విషయంలో ఈవోని వెనకేసుకుని రావడం, ఆయన చేసే అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే అందులో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావిస్తున్నారు. • రోడ్డు పక్క ఫుట్ పాత్ కి ఆలయానికీ సంబంధం ఏంటి? మే 26వ తేదీన మల్లిఖార్జున మహామండపంలో అడిషనల్ లిఫ్ట్ ఛాంబర్ కనస్ట్రక్షన్ పేరిట రూ. 2 కోట్ల 98 లక్షలు బిల్లులు డ్రా చేశారు. కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంటే ఎవరూ చూడరు, స్పందించరని వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో కోట్లాది రూపాయిలు చెల్లించడం దోపిడి కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇందులో మీ భాగస్వామ్యం ఎంత? వినియోగంలో ఉన్న లిఫ్టులకు ఏరకంగా బిల్లులు చెల్లించారు? ఇంతకంటే అక్రమం ఏమైనా ఉంటుందా? కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున స్ట్రీట్ వరకు ఫుట్ పాత్ నిర్మాణం పేరిట రూ. 10 లక్షల 23 వేల బిల్లులు చెల్లించారు. అదీ మే 26నే చెల్లించారు. ఈ ఫుట్ పాత్ కీ కనకదుర్గమ్మ దేవస్థానానికీ సంబంధం ఏంటి? ఫుట్ పాత్ వేస్తే నగరపాలక సంస్థ వేయాలి. లేదా ఫ్లై ఓరవర్ నిర్మిస్తున్న హైవే ఆధారిటీ నిర్మించాలి. అన్ని బిల్లులు లాక్ డౌన్ సమయంలోనే చెల్లించడం వెనుక ఆంతర్యం ఏంటి? అమ్మవారి ఆదాయాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారు? • నాలుగేళ్లుగా మహా మండపాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు కమర్షియల్ కాంప్లెన్స్ ప్లేసులో రెండు మరుగుదొడ్లు కట్టి రూ. 64 వేలు బిల్లులు డ్రా చేశారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పరు. అమ్మవారి సొమ్మును ఇంత బహిరంగంగా దోచుకుంటుంటే మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది. ఆలయ మహామండపం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మహా మండపం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. నిత్యం ఏదో ఒక పని అని చూపుతూ లక్షలాది రూపాయిలు అక్రమ బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవేజ్ ప్లాంట్ పేరుతో బయటి నుంచి విరాళాలు సేకరించారు. అవి ఏమయ్యాయో తెలియదు. ప్లాంట్ పేరుతో రూ. 53 లక్షల 69 వేల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పినవే రూ. 3 కోట్లు ఉన్నాయి. అమ్మవారి ఆదాయానికి ఇంత పెద్ద ఎత్తున గిండికొడుతుంటే అధికారులు, మంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఈవో సురేష్ బాబు గారి అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది అందుకే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారు. మేము ఉత్తుత్తి ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. వాస్తవాలను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. అమ్మవారి సొమ్ము కోట్లాది రూపాయిలు స్వాహా చేస్తున్నా మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు. దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం మానవత్వం చూపకుండా నిర్ధయగా తీసేశారు. కరోనా విపత్కాలంలో వారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. ఒక పక్కన ఆదాయం డబ్బులు లేవు అని చెబుతారు. కోట్లాది రూపాయిలు బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. అసలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పేంటి? దశాబ్దకాలం 12 గంటలు నిబద్దతగా పని చేయడమే వారు చేసి తప్పా? మీరు చెప్పిన విధంగా అవినీతి పనులకు పాల్పడకపోవడం వల్లనే వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేసిన మాట వాస్తవం కాదా? ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టాం. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం అని చెబుతారు. మరి వీరి తొలగింపులో ఎందుకు జోక్యం చేసుకోరు. ప్రసాదం ప్యాకింగ్ కోసం రోజుకి రూ. 500 ఇచ్చి బయట నుంచి కార్మికుల్ని పెట్టుకుంటున్నారు. ఆ పని ఏదో వారితోనే చేయించుకోవచ్చు కదా? కొండ మీద కోర్టులు సైతం వద్దన్న ఒకరిద్దరు ఉద్యోగులను ఈవో గారికి సన్నిహితులు అన్న నెపంతో చిన్న ఆర్డర్ తో విధుల్లో కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో లడ్డూ ప్రసాదం విక్రయం అని చెప్పి వారిని అక్కడ విధుల్లో పెట్టడం వాస్తవం కాదా? విక్రయాలు నిలిపివేసిన తర్వాత కూడా విధుల్లో ఎలా కొనసాగిస్తున్నారు. మీ అవినీతిలో భాగస్వాములు అయ్యే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా? సెంట్రల్ నియోజకవర్గంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 900 గజాల విలువైన భూమిని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోత్సాహం ఉందన్న ప్రచారం జరుగుతుంటే స్వయానా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీ మల్లాది విష్ణు గారు ఎందుకు దాన్ని ఖండించడం లేదు. అది అబద్దం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. దేవాలయ వ్యవస్థల్ని పరిరక్షించాల్సింది పోయి రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని శాశ్విత ఆదాయ వనరుగా మార్చుకునేందుకు మీరు చేస్తుంది కుట్ర కాదా? దీని మీద కూడా ఎవరూ స్పందించరు. మంత్రి పెద్ది రెడ్డి గారు జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో మీరు ప్రోత్సహిస్తుంది అభివృద్ధినా? అవినీతినా? దుర్గగుడి కేంద్రంగా జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? • హైకోర్టు తీర్పుని అమలుపర్చాలి దుర్గ గుడిలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పాలక మండలి ఏం చేస్తోంది. చైర్మన్ పైలా స్వామి నాయుడు గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీకు ఈవో గారి అక్రమాల్లో భాగం ఉందా? అక్రమాలను అడ్డుకోలేని ఈ పాలక మండలి పనికి రాదు కోర్టు తీర్పుల అమలుపర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈవో సురేష్ బాబు గారు పనికి రారు అన్న హైకోర్టు తీర్పుని వెంటనే అమలుపర్చాలి అని అన్నారు.
Image