నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలోని అన్నీ గ్రంధాలయాల్లో పాఠకులకు ఇబ్బంది లేకుండా డిజిటలైజేషన్ ఆఫ్ బుక్స్ కార్యక్రమాన్ని చేపడంతో పాటు అవసరమైన టేబుల్స్, కుర్చీలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద పేర్కొన్నారు.
జిల్లా గ్రంధాలయ సంస్థకు సంబంధించి 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేటాయించిన బడ్జెట్ ఆమోదం నిమిత్తం బుధవారం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో జిల్లా చైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద అధ్యక్షతన జిల్లా గ్రంధాలయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేటాయించిన బడ్జెట్ పద్దులకు అనుగుణంగా వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన అనుమతులపై సమావేశంలో చర్చించడం జరిగింది.ఈ సందర్భంలో ఛైర్ పర్సన్ శ్రీమతి దొంతు శారద మాట్లాడుతూ, జిల్లాలోని అన్నీ గ్రంధాలయాల్లో పాఠకులకు ఇబ్బంది లేకుండా డిజిటలైజేషన్ ఆఫ్ బుక్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా కేంద్ర గ్రంధాలయం నందు 3 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులు జరుగుచున్నవని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్ పర్సన్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి శ్రీ కుమార్ రాజ, సూపరింటెండెంట్ శ్రీ ప్రసాద్, వయోజన విద్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment