అర్హత ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా సంక్షేమ పథకాలు కోల్పోకూడదు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, వెంకటాచలం మండల  కేంద్రం,  రైల్వే   స్టేషన్  రోడ్డులో జరిగిన   "గడప గడపకు మన ప్రభుత్వం"  కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు.


శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి, వెంకటాచలం మండల  కేంద్రంలోని  రైల్వే   స్టేషన్  రోడ్డులో  ప్రతి వీధి తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సేవలు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా  తెలుసుకుంటూ, ఏమైన సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతి  కుటుంబాన్ని కలుసుకోవడంతో పాటు   ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 


ఈ సంధర్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అర్హత ఉన్న  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా  సంక్షేమ పథకాలు కోల్పోకూడద


నే ఉద్దేశంతో  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి  గారు వినూత్నంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు.  అందులో భాగంగా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నామని, వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయడంతో పాటు, వారి అవసరాలను తెలుసుకుంటున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.   ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.  జిల్లాలో ఎన్నికల కోడ్ వచ్చినందున జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగిందని,  ఎన్నికలు అయిపోయినందున  తిరిగి ఈ రోజు నుండి  నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. దాదాపుగా 50 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాం, పట్టాలు మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరగా, వారికి నివేశన స్థల పొజిషన్ సర్టిఫికెట్లు   ఈ రోజు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. అంతే కాకుండా సుదీర్గ కాలంగా ఈ ప్రాంతంలో వున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.   ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నామన్నారు.  ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు  ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేశారని అన్నారు. నియోజక వర్గ పరిధిలోని ప్రతి గడపుకు వెళ్ళి  వారి సమస్యలను,  స్థానిక సమస్యలను  తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు తక్షణమే పరిష్కరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 


మంత్రి వెంట  వెంకటాచలం మండలం జడ్.పి.టి.సి  సభ్యులు  శ్రీ సుబ్రమణ్యం, ఉప ఎం.పి.పి  శ్రీ కోదండరామయ్య, మండల ప్రత్యేక అధికారి, మెప్మా పి.డి శ్రీ రవీంద్ర, ఎం.పి.డి.ఓ శ్రీమతి సుస్మితా రెడ్డి,  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments