నెల్లూరు (ప్రజా అమరావతి);
రామయపట్నం పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రానున్న నేపధ్యంలో మంగళవారం సాయంత్రం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. కరికల్ వలవెన్, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు తో కలసి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు జారీచేశారు. ఈ సంధర్భంగా చేపట్టాల్సిన పైలాన్ ఏర్పాట్లు, హెలిపాడ్, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. కరికల్ వలవెన్ మీడియాతో మాట్లాడుతూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింద
ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మౌలిక సదుపాయాలకు, పరిశ్రమల మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటి నిర్మాణాలను చేపట్టడం జరుగుచున్నదన్నారు. అదేవిధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ను అబివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా రాష్టంలో లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లను చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ ను అభివృద్ది చేసేందుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించునున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ తో కలసి ముఖ్యమంత్రి గారి శంఖుస్థాపన కార్యక్రమ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ పోర్టు నిర్మాణం వలన పరిశ్రమల పరంగా, పర్యాటక పరంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుందని, జిల్లాకు, ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్ట్ నిర్మాణం ఒక వరమని ఆన్నారు. దగ్గరలోనే జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని, 2013 కొత్త చట్టాన్ని అనుసరించి భూసేకరణ మరియు ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీని నిర్ణయించుకొని నిర్వాసితులకు అందించడం జరుగుతుందన్నారు. పోర్ట్ పరిధిలో 3 గ్రామాలకు చెందిన 600 కుటుంబాల వరకు నిర్వాసితులు అగుచున్నందున, వారికి చట్టపరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని, ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీని అందించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు పోర్ట్ నిర్మాణానికి ఎంతో సహకరిస్తున్నారని, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి చేపట్టాల్సిన నిర్వాసిత పనులను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.కూర్మనాథ్, కందుకూరు ఆర్.డి.ఓ శ్రీ జి.వి సుబ్బారెడ్డి, ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణమోహన్, డి.ఆర్.డి.ఏ పి.డి శ్రీ సాంబశివా రెడ్డి, తహశీల్దార్ శ్రీమతి లావణ్య, రామాయపట్నం పోర్ట్ నిర్మాణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. కరికల్ వలవెన్, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు తో కలసి దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబందించి చేపట్టాల్సిన భూసేకరణ వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దగదర్తి ఎయిర్ పోర్ట్ కు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
వీరి వెంట కావలి ఆర్.డి.ఓ శ్రీ శీనా నాయక్, తహశీల్దార్ శ్రీమతి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment