నెల్లూరు (ప్రజా అమరావతి);
కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సెంబ్ కార్ప్ సంస్థ వైద్య, విద్యా రంగాల్లో చేయూత అందించడం అభినందనీయమ
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, ముత్తుకూరు మండలం, ముసునూరువారిపాలెం గ్రామంలోని జడ్పీ హై స్కూల్లో సెంబ్ కార్ప్ సంస్థ వారి సహకారంతో హైదరబాద్ కు చెందిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా ఉచిత సామాజిక కంటి పరీక్షల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సృష్టిలో దేనైనా ఆస్వాదించాలన్న, చూడాలన్న దృష్టిపై ఆధారపడి వుంటుందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ గా వున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్ధులకు కంటిపరీక్షలు నిర్వహించగా మూడో వంతు విద్యార్ధులకు దృష్టి లోపాలు వున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. సెంబ్ కార్ప్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ముత్తుకూరు, టి.పి గూడూరు మండలాల్లోని 47 గ్రామాల్లో సుమారు 10 వేల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని మంత్రి అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో స్థానిక ప్రజలకు సంబందించి వైద్య, విద్యా కార్యక్రమాలను విస్తృత పర్చాల్సిన అవసరం వుందని ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, సెంబ్ కార్ప్ సంస్థ కు సూచించారు.
ఈ సంధర్భంగా ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 500 పైబడి మార్కులు సాధించిన నలుగురు విద్యార్ధులకు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మెమోంటో అందచేసి అభినందించారు. అనంతరం జగనన్న విద్యా కానుక కిట్లను మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, విద్యార్ధులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సెంబ్ కార్ప్ సంస్థ ప్రతినిధులు శ్రీ రమేష్, శ్రీ రఘురాం, జడ్.పి.టి.సి సభ్యులు శ్రీ పి. వెంకట సుబ్బయ్య, ఏం.పి.పి శ్రీమతి సుగుణ, , ఉప ఎం.పి.పి లు శ్రీ చినప రెడ్డి, శ్రీమతి విజయమ్మ, ఎం.పి.డి.ఓ శ్రీమతి ప్రత్యూష, తహశీల్దార్ శ్రీమతి సుబధ్ర, సర్పంచ్ శ్రీ జనార్ధన్ రెడ్డి, సెంబ్ కార్ప్ సంస్థ ప్రతినిధులు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment