తెలుగు భాష ప్రాశస్త్యం, ప్రాభవం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాo.


నెల్లూరు, జూలై 16 (ప్రజా అమరావతి) : వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనమని, ఇదే స్ఫూర్తితో భవన నిర్మాణానికి కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శనివారం మధ్యాహ్నం వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ అధ్యయన కేంద్రాన్ని  దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి సాధిస్తే, భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రత్యేక కృషితో వెంకటాచలంలో నెలకొల్పడం జరిగిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేంద్రం సొంత భవన నిర్మాణానికి వెంకటాచలం సమీపంలోని చవటపాలెంలో కోటి రూపాయలు విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని తాను అడిగిన వెంటనే తెలుగు భాష పై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. ఈ కేంద్రానికి సొంత స్థలంలో భవన నిర్మాణాల విషయమై భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతో గొప్ప ఆశయంతో తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా కాపాడుకోవడం తన బాధ్యత అని, అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి విన్నవించి స్థలాన్ని మంజూరు చేయించుకున్నామని, సొంత భవనాలు కూడా నిర్మించి తెలుగు భాష ప్రాశస్త్యం, ప్రాభవం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామ


ని, తద్వారా తెలుగు భాష పూర్వ వైభవానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

 అనంతరం మంత్రిని అధ్యయన కేంద్రం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తదుపరి మంత్రి చేతుల మీదుగా పలువురు కవులు, రచయితలను సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం డైరెక్టర్ శ్రీ మునిరత్నం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, సీనియర్ పాత్రికేయులు, రచయిత శ్రీ జయప్రకాష్, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. 


Comments