రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూoది.



నెల్లూరు జులై 17 (ప్రజా అమరావతి):-- రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ


వారిని అన్ని విధాలా ఆదుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పేర్కొన్నారు


ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన 40 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రు. 24.60 లక్షలు విలువ చేసే బ్యాంకు చెక్కులను అందజేశారు. 


ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడు  పేద ప్రజలకు అండగా ఉంటూ వారిని అన్ని విధాల ఆదుకుంటున్నారన్నారు.  ముఖ్యంగా పేద కుటుంబాల వైద్యానికి సంబంధించి ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతగా తీసుకొని వారికి అండగా నిలుస్తున్నారన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్ని రకాల వ్యాధులు చేర్చారు, తరచుగా ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందో వాటిని కూడ ఆలోచించి అధ్యయనం చేసి ఆ పథకంలో చేర్చేందుకు ఒకవైపు కృషి చేస్తూ మరోవైపు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకుంటే పథకం వర్తించేలా రూపకల్పన చేశారన్నారు. ఏదైనా కారణాల వలన ఆరోగ్య శ్రీ పథకం కింద వర్తించలేని వ్యాధుల బారిన పడి వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు ఆర్థిక సహాయం  అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా సహాయం అందిస్తున్నామన్నారు. చాలా కుటుంబాలు వైద్యం అందక ఆర్థికంగా చితికిపోయి చివరకు ఆస్తులు అమ్మి ప్రాణాలు నిలబెట్టుకున్న దుస్థితి గతంలో నెలకొందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం లో అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స చేయించుకుని ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించిన 40 మందికి 24.60 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పేదవారికి ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకోసం"  నాడు- నేడు " కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు,  ప్రాంతీయ వైద్యశాలలు, జిల్లా వైద్యశాలలో అనేక మౌలిక సదుపాయాలు  కల్పించడమే కాకుండా  అవసరమైన మందులు వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు డాక్టర్లను భర్తీ చేయడం, 104 వైద్య సేవలు, 108 అత్యవసర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం సంపూర్ణ స్థాయిలో  అర్హులైన అందరికీ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రతి మండలంలో రెండు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు  అండదండలుగా నిలుస్తోందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించినందుకు వారంతో సంతోషంగా ఉన్నారని,వారు జీవిత కాలం ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా తోడ్పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎవరు అడిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదారభావంతో ఆర్థిక సహాయం అందిస్తారని దానికి నిదర్శనంగా ఇటీవల కాలంలో తుపాకీ కాల్పులకు గురై మృత్యువాత పడ్డ తాటిపర్తికి చెందిన కావ్య శ్రీ పై ఆధారపడి ఉన్న వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఉదారంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల పట్ల ఎంతో ఉదారత, ప్రేమ అభిమానాలతో ఉంటారని వారు అనుసరిస్తున్న విధానం ద్వారా తేటతెల్లమవుతుందన్నారు.  ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికీ వుండాలనే విశ్వాసంతో ప్రజలు ఉన్నారని,  రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దొరకటం రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాంటిదన్నారు.  లబ్ధి పొందిన కుటుంబాల వారు ముఖ్యమంత్రి కి తమ ఆశీస్సులను అందిస్తున్నారన్నారు.  వైద్యం చేయించుకున్న కుటుంబాల వారు సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

Comments