రూ.1.38 కోట్లతో పెందుర్రు గ్రామంలో మన బడి నాడు-నేడు రెండవ దశ పనులు

 


బంటుమిల్లి (పెందుర్రు): ఆగస్టు 20, (ప్రజా అమరావతి);


*‌రూ.1.38 కోట్లతో పెందుర్రు గ్రామంలో మన బడి నాడు-నేడు రెండవ దశ పనులు*


*‌రూ. 48 లక్షలతో ఇంటింటికీ నీటి కుళాయి కన్నెక్షన్లు*


*‌శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్*

               

            మన బడి నాడు-నేడు పథకం కింద రెండవ దశలో పెందుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 1.38 కోట్ల విలువైన పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శంకుస్థాపన చేశారు.

              శనివారం ఉదయం ఆయన బంటుమిల్లి మండలం, పెందుర్రు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ. 1.38 కోట్ల విలువైన మన బడి నాడు-నేడు రెండవ దశ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో ఎనిమిది అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఫర్నీచరు, గ్రీన్ చార్ట్ బోర్డులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

             

            కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాటశాలల రూపురేఖలు మార్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ధనం శాశ్వతం కాదని విద్య మాత్రమే శాశ్వతమైనదని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదువుకుని భవిష్యత్తులో అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. గ్రామంలో రూ.48 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల నిమిత్తం అదనంగా మరో రూ. 20 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు పాటశాలకు ప్రహరీ గోడను నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముందు తాళమేళాలతో గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

                 ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండలం జెడ్పీటీసీ మల్లిసెట్టి వెంకట రమణ, ఎంపీటీసీ మాదాసు లక్ష్మీ తులసమ్మ, ఎంపీపీ వెలివల చినబాబు, పెందుర్రు గ్రామ సర్పంచ్ చిటికినేని వైశాలి, విద్యా కమిటీ చైర్మన్ పాపాని వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సుబ్రమణ్యం, వైఎస్సార్ సీపీ నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image