తాడేపల్లి (ప్రజా అమరావతి);
*ఈనెల14న రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అరవింద స్కూల్ సంయుక్తఆధ్వర్యంలోవిద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు
*
తాడేపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మరియు అరవింద హై స్కూల్స్ కుంచనపల్లి వారి సంయుక్త ఆధ్వర్యంలో
75వభారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని "జననీ జయహే "కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా తాడేపల్లి మండల పరిధిలోని ప్రైవేట్ స్కూల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు ఆగస్టు 14వ తారీఖున అనగా ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి వివేకానందరెడ్డి ఓ
ప్రకటనలో తెలియ జేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాన్సీ డ్రెస్ ,ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్లు తాడేపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు
(తెలుగు మరియు ఇంగ్లీష్మీడియం)పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1.ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్( L)
ఎల్కేజీ టు 5 వ తరగతి వరకు
(వారికినచ్చినస్వాతంత్ర సమరయోధుని వేషధారణ ప్రదర్శన)
2.ఎలక్యూషన్ కాంపిటీషన్
(ఉపన్యాసం 1 నిమి)
ఆరవ తరగతి నుంచి 8వ తరగతి వరకు
3. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్
(9 మరియు10 వ తరగతి పిల్లలకు)
(వ్యాసరచన పోటీ)
(75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం మరియు పురోగతి) పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి పాఠశాల నుంచి విభాగానికి ముగ్గురు చొప్పున మొత్తం మూడు విభాగాలు కలిపి 9 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనవచ్చు అని తెలిపారు పోటీలలో
పాల్గొనాలని ఆసక్తి కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఈనెల 12వ తేదీ శుక్రవారం సాయంత్రం లోపు తమపేర్లును ఈ నంబర్లకు 7799857679,
9494792353
ఫోన్ చేసినమోదు చేసుకోవాలని తెలిపారు.ఆదివారం (అనగా 14 ఆగస్టున) అరవింద హైస్కూల్ నందు జరగనున్న పోటీలలో తమ విద్యార్థులను భాగస్వామ్యులని
చేయాలని కోరారు.
addComments
Post a Comment