14వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం

 తెనాలి (ప్రజా అమరావతి);   ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణం 14 వ వార్డు చిన్నరావూరు రైల్వే గేట్ సమీపం నుండి తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్  "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా తెనాలి మున్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ మరియు 14 వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంత రావు  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్ 


మరియు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు, YSRCP నాయకులు, మరియు సంబంధిత అధికారులతో కలసి గడప గడప కు వెళ్లి వారికి ఈ ప్రభుత్వం లో గత 3 సంవత్సరాల నుంచి అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, వారు వారి కుటుంబాల వారీగా  పొందిన లబ్ది ను సవివరంగా వివరించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ చేదోడు, అమ్మ వడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, మన బడి నాడు నేడు, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ బీమా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ కళ్యాణ కానుక,  వైయస్సార్ చేయూత మొదలైన పథకాల ద్వారా మరియు ఎన్నో సబ్సిడీ స్కీములు ద్వారా ప్రజలకు జగనన్న ఈ ప్రభుత్వం లో చేయాలనుకున్న మంచి ఆయన కృషి నీ ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లారు.గత ప్రభుత్వం లో అధికారం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కారని, కానీ జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, ఈ పథకాలను అమలుపరిచారని తెలిపారు.కరోనా మహమ్మారి, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ అన్న మంచి మనసు దూరదృష్టి మరెవ్వరికీ లేదని కితాబిచ్చారు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image