ఘనంగా జేఎన్టీయుకె 14వ వార్షిక వేడుకలు

 ఘనంగా జేఎన్టీయుకె 14వ వార్షిక వేడుకలు


   కాకినాడ, ఆగస్టు 20 (ప్రజా అమరావతి): జవహర్ లాల్ నెహ్రూ  ఇంజనీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ (జెఎన్టియుకె) 14వ వార్షిక వేడుకలను శనివారం అలూమ్ని ఆడిటోరియంలో వేడుకలను జెఎన్టియుకె అధికారులు ఘనంగా నిర్వహించారు .    

    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపకులపతి జివిఆర్ ప్రసాదరాజు,  విశిష్ట అతిథులుగా మాజీ ఉపకులపతులు జి తులసీరాం దాస్, విఎస్ఎస్ కుమార్, ఇన్ఛార్జి ఉపకులపతులు వి ప్రభాకరరావు, ఎస్ రామకృష్ణారావులు విచ్చేశారు. జెఎన్టియుకె ఉపకులపతి అల్లం అప్పారావు ఆన్లైన్లో పాల్గొనగా అతిథులుగా రెక్టార్ కెవి.రమణ, ఓఎస్డ్ డి కోటేశ్వరరావులు వేదికనలంకరించారు. రిజిస్ట్రార్ ఎల్ సుమలత కార్యక్రమానికి అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా ఉపకులపతి జివిఆర్ ప్రసాదరాజు మాట్లాడుతూ జెఎన్ టియుకె యూనివర్శిటీ ఈ 14 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు . అధ్యాపకులు పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి యూనివర్శిటీ ప్రతిష్టను పెంచాలని సూచించారు . విశ్వవిద్యాలయ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె హేమచంద్రా రెడ్డిలు తమ వంతు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు . 

   యూనివర్శిటీ పరీక్షల విభాగంలో పలు మార్పులను తీసుకురావడంతో పాటు పిహెచ్ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు , విద్యార్థులకు ఏవిధమైన సమస్య వచ్చినా తక్షణం పరీక్షించేందుకు యూనివర్శిటీ అధికారులు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు . ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని , అధ్యాపకులు బోధనలో నూతన మెళకువలు నేర్చుకునేలా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు నిర్వహించమన్నారు. అదేవిధంగా డిఏఏ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులకు ర్యాటిఫికేషన్ ప్రక్రియ, అనుబంధ కళాశాలల్లో ఎఫ్ఎఫ్సీ కమిటీల ద్వారా తనిఖీలు చేయడం జరిగిందన్నారు . జెఎన్టియుకె యూనివర్శిటీ ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందున ఐఎసి గుర్తింపు లభించిందని , ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ ) ద్వారా జెఎన్టియుకెకు ఈట్ రైట్ క్యాంపస్ సర్టిఫికేషన్ 5 స్టార్ రేటింగ్తో గుర్తింపునిచ్చిందన్నారు . భారతదేశంలో ఈ గుర్తింపు పొందిన మూడవ యూనివర్శిటీ , దక్షిణ భారతదేశంలో ఏకైక  యూనివర్శిటీ జెఎన్టియుకె ఒక్కటేనన్నారు . జెఎన్టియుకె యూనివర్శిటీ విజయవాడలోని డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటీతో జాయింట్ రీసెర్చ్ చేపట్టేందుకు ఎంఓయు కుదుర్చుకుందన్నారు.

   ఈ ఏడాది ఏపి ఈసెట్ -2022 ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసినట్లు ఉపకులపతి ప్రసాదరాజు తెలిపారు. త్వరలో జెఎన్టియుకె విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ భవనం, వసతి గృహాలు, రోడ్లు & డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు .       

   జెఎన్టియుకెలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు . జెఎన్టియుకె యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసారావుపేట ( యుసిఈఎన్ ) కళాశాలను త్వరలో శాశ్వత భవనాల్లోకి మారుస్తామన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యనందించనున్నామన్నారు . అనంతరం యూనివర్శిటీ వార్షిక నివేదికను అతిథులు ఆవిష్కరించగా మాజీ ఉపకులపతులు జెఎన్ టియుకెలో తాము అవలంభించిన విధానాలను, కార్యక్రమాలను వివరించారు. ఈ నేపథ్యంలో మాజీ ఉపకులపతులను, రెక్టార్లను , రిజిస్ట్రార్లను అతిథులు శాలువాలతో సత్కరించి మెమెంటోలను బహూకరించారు. 

    ఓఎస్డి డి కోటేశ్వరరావు కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు , ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యుసిఇకె & యుసిఇఎన్ ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు , అధ్యాపకులు, అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image