ఆంధ్రకేసరి 151 వ జన్మ దినవేడుకలతో గోదావరి నదితీరం పులకరించింది..



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



ఆంధ్రకేసరి 151 వ జన్మ దినవేడుకలతో గోదావరి నదితీరం పులకరించింది..



మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ





బ్రిటిష్ పాలకుల నియంత్రణ దొరణికి ఎదురొడ్డి మద్రాసులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా తన వాక్కు వినిపించి వెరవక  గుండె చూపిన థీరోదాత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు  అని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ  శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు.


స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుల పార్కు లో దేశభక్తులకు ఆంధ్రకేసరి యువజన సమితి సత్కారోత్సవం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రా కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి మంత్రి , పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ ఎమ్.షర్మిలా రెడ్డి, స్థానిక నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, తదితరులు ఘనంగా నివాళులర్పించారు.



 ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ వేదంలా ఘోషించే గోదావరి అమర నాదం లా శోభిల్లే రాజమహేంద్రి అనే గీతంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క ప్రతిభా విశేషాలు పేర్కొనడం జరిగిందన్నారు. దేశం కోసం, పార్టీ కోసం తన యావదాస్తిని తృణప్రాయంగా  త్యజించిన వ్యక్తి నేటి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సీ ఉందన్నారు. రాజమహేంద్రవరం నగర మునిసిపాలిటీ కి 1904 లో చైర్మన్ గా పనిచేసి, తదుపరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి నట్లు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల పార్కు ద్వారా జక్కంపూడి విజయలక్ష్మి నేటి తరానికే కాదు భవిష్యత్తు తరాల కోసం చక్కటి మన దేశ స్వాతంత్ర్య పోరాట నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి దేశభక్తిని చాటు కోవడం అభినందనీయం అన్నారు.



ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ గోదావరి తీరాన స్వాతంత్ర్య సమర ఉద్యమం ఎంతో గొప్పగా జరిగిందన్నారు.

ఎంతోమంది త్యాగధనుల వల్ల నేటి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. 


మాసొత్సవ సమితి అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ మాసోత్సవాల్లో ఎంతోమంది పాలుపంచుకున్నారని వారందరూ ధన్యులన్నారు. సమితి పూర్వాధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత వేదంలా ఘొషించే గోదావరి పాటకు అభినయం చేశారు..


కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు,రుడా చైర్ పర్సన్ మేడపాటిషర్మిలారెడ్డి, టి.కె.విశ్వశ్వరరెడ్డి, బొంత శ్రీహరి తదితరులు ప్రసంగించారు. కమిటీ కన్వీనర్లు దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాస్,పెదిరెడ్ల శ్రీనివాస్ లను సత్కరించారు.


Comments