ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి:సిఎస్.

 ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి:సిఎస్.



విజయవాడ,12, ఆగస్టు (ప్రజా అమరావతి): ఈనెల 15వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏటువంటి లోటుపాట్లు ఆస్కారం ఇవ్వొద్దని ఆయన అధికారులకు స్పష్ఠం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి ఆయా శాఖల వారీగా చేస్తున్న ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల వారీగా చేస్తున్న ఏర్పాట్లను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఈసమావేశంలో రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల వారీగా చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.ఈనెల 15వతేదీ ఉదయం 8.30 గం.ల నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్నారు.గత రెండేళ్లలో కరోనా పరిస్థితులు వల్ల సాధారణ ప్రజలను వేడుకులకు అనుమతించలేదని ఈసారి వేడుకలకు 6వేల మంది వరకు విద్యార్థులు, తదితరులు హాజరు కానున్నారని వివరించారు.


వీడియో లింక్ ద్వారా ఈవీడియో సమావేశంలో పాల్గొన్న సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై 15 శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.


ఈవీడియో సమావేశంలో ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డిజిపి బాగ్సి, శాంతి భద్రతల అదనపు డిజిపి రవిశంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.



Comments