అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా (ప్రజా అమరావతి);
ఏటీసీ టైర్స్ ఏపీ ప్రేవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే,
గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి.
అందరికీ నమస్కారం, ఒక రికార్డు సమయంలో సీఎంగారి నాయకత్వంలో ఆయన చొరవతో అతి తక్కువ సమయంలో కేవలం 15 మాసాల్లో ఇంత పెద్ద ఇండస్ట్రీని మన అచ్యుతాపురంలో స్ధాపించుకోవడం మన అదృష్టం
. సహజంగా వంద, రెండు వందల కోట్లతో ఇండస్ట్రీని స్ధాపించాలంటే ఎంత సమయం పడుతుందో మనకు తెలుసు. అటువంటిది దాదాపు రూ. 1,400 కోట్లతో 15 నెలల్లో ఇంత పెద్ద సంస్ధ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన సీఎంగారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇండస్ట్రీ కూడా అతి తక్కువ సమయంలో దాదాపు 800 – 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ , రెండో దశలో మరో వెయ్యి కోట్ల పెట్టుబడితో కంపెనీ పూర్తయ్యే సమయానికి 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే గొప్ప పరిశ్రమ మన ప్రాంతానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మన ప్రాంతం నుంచి రేపు 120 దేశాలకు ఇక్కడ తయారైన టైర్లు వెళ్ళబోవడం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి గర్వకారణం. ఇటీవలే మనం చూసినట్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్ధానంలో నిలిచిందంటే దానికి ఆద్యులు శ్రీ వైఎస్ జగన్‌గారు, కంపెనీల ప్రతినిధులు అన్నట్లు అనుమతుల కోసం వారు మన చుట్టూ తిరగకుండానే మన అధికారులే కంపెనీల చుట్టూ తిరిగి లైసెన్స్‌లు వారికిచ్చే విధంగా ఉత్సాహంగా మన శాఖ పనిచేస్తుంది. రానున్న రోజుల్లో పారిశ్రామికరంగంలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలిపేందుకు సీఎంగారి సహకారంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, నూతన కంపెనీలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సీఎంగారు ఇక్కడున్న కొద్ది సమయంలోనే కంపెనీల వారికి ఒక మాట చెప్పారు, కంపెనీలకు ఏం కావాలన్నా మా ప్రభుత్వం నుంచి మేం అందిస్తాం కానీ మీరు మాత్రం స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. సీఎంగారి చిత్తశుద్దికి ఇది నిదర్శనం. స్ధానికులకు అన్ని రకాలుగా ప్రాధాన్యతను ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దానికి కంపెనీలు కూడా సహకరిస్తాయి. ధన్యవాదాలు.
addComments
Post a Comment