జాయింట్ కలెక్టర్ ఆగస్ట్ 15 అవార్డు ను అందచేసిన కలెక్టర్

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


జాయింట్ కలెక్టర్ ఆగస్ట్ 15 అవార్డు ను అందచేసిన కలెక్టర్ 



76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉత్తమ జిల్లా అధికారిగా అవార్డ్ గ్రహీత జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళ వారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, యువ ఐఎఎస్ అధికారులు వారి లోని ప్రతిభను ప్రదర్శించడం ద్వారా జిల్లా అభివృద్ధి పథంలో నడిపేందుకు మరింతగా కృషి చేస్తూ, మరింత మందికి మార్గదర్శకంగా నిలవాలని తెలుపుతూ, అభినందనలు తెలిపారు.



సోమవారం అత్యవసర పరిస్థితుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడం తో మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అవార్డ్ అందుకున్నారు.


ఈ సందర్భంగా డి ఆర్ వో బి. సుబ్బారావు, ఇతర అధికారులు జాయింట్ కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు. 


Comments