రాజమహేంద్రవరo (praja amaravati);
పరమేశి బయోటెక్ (మొక్కజొన్న పరిశ్రమ) లో ఆగస్ట్ 4 న జరిగిన ప్రమాద ఘటన లో మృతి చెందిన గాజుల శ్రీను కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ద్వారా రూ.20 లక్షల పరిహారాన్ని అందించడం జరిగింద
ని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు లు తెలిపారు.
గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శాసన సభ్యులు తలారి వెంకట్రావు, జిల్లా కలెక్టర్ మాధవీలత సమక్షంలో గాజుల శ్రీను కుటుంబానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ స్వరూప్ అద్వానీ రూ.20 లక్షలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆగస్ట్ 4 గురువారం పరమేశి బయోటెక్ పరిశ్రమలో జరిగిన ఘటనలో కొవ్వూరు మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన గాజుల శ్రీను మృతి చెందడం జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు తక్షణం అధికారులతో విచారణ జరిపి మృతుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈరోజు శాసన సభ్యులు సమక్షంలో చెక్కును అందజేశారని తెలిపారు.
సంఘటన జరిగిన రోజున శాసనసభ్యులు తలారి వెంకట్రావు సమక్షంలో రెవెన్యూ, పరిశ్రమలు, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి శాఖ, అగ్ని మాపక శాఖ అధికారులు విచారణ జరిపినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మా కుటుంబానికి అండగా ఉండి కంపెనీ యాజమాన్యం ద్వారా రూ.20 లక్షలు పరిహారం అందేలా చేసినందుకు మృతుడు గాజుల శ్రీను తల్లిదండ్రులు కుమారి, జీవివి సత్యనారాయణ లు కృతజ్ఞతలు తెలిపారు.
addComments
Post a Comment