కాణిపాకంలో ఈ నెల 21న స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం...శ్రీ మహాగణపతియే నమః


   *మహిమాన్వితం శ్రీ వరసిద్ధి క్షేత్రం* 


కాణిపాకంలో ఈ నెల 21న స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం... స్వస్తి  శ్రీ  చంద్రమాన శుభ కృత్ నామ సంవ త్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త  శుభ కన్యా లగ్నము నందు ఆదివారం ఉ.8 గం.ల నుండి 9  గం.ల వరకు విమాన గోపురం మరియు ధ్వజస్తంభములకు మహా కుంభాభిషేకం.


స్వామివారి సేవలో తరిస్తున్న భక్తులు


కుంభాభిషేకం అనం తరం దర్శ నానికి మధ్యాహ్నం 2గంటల నుంచి అనుమతి


పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలం కరణలతో శోభాయ మానంగా కాణిపాక ఆలయం


 మహా కుంభా భిషేకానికి సర్వం సిద్ధం


 కాణిపాకం,ఆగస్టు 20 (ప్రజా అమరావతి); 


వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకానికి సర్వం సిద్ధమైంది.


ఈనెల 21న ఆదివా రం శాస్ర్తోక్తంగాచతు ర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు..


స్వస్తి  శ్రీ చంద్రమాన శుభ కృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త  శుభ కన్యా లగ్నము నందు ఆదివారం ఉ.8 గం.ల నుండి 9  గం.ల వరకు విమాన గోపురం మరియు ధ్వజస్తంభములకు మహా కుంభాభిషేకం జరుగును.. 


మహా కుంభాభిషేకం లో భాగంగా ఉ. 6 గం.ల నుండి చతుర్థ కాల హోమము, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన,ఉ.8 గం.ల నుండి 8.30 గం.ల లోపు రాజ గోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం,నూతన ధ్వ జస్తంభములకు "మ హా కుంభాభిషేకం". ఉ.8:30 నుండి 9 గం.ల లోపు స్వయం భు శ్రీ వరసిద్ధి వినా యక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం,   సా. 6 గం.ల నుండి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి "తిరు కళ్యాణo" మరియు గ్రామోత్సవం జరు గును..


మహా కుంభాభిషే కము అనంతరం మ.2 గం.ల నుండి స్వామి వారి మూల విరాట్ దర్శనం కల్పించబడుతుంది.


ఆలయ పునర్నిర్మా ణము నకు శ్రీమతి గాయత్రీ దేవి, శ్రీ ఐకా రవి బోస్టన్,యూ ఎస్ ఏ వారు, శ్రీమతి జానకి శ్రీ గుత్తికొండ శ్రీనివాస్ టoపా, ఫ్లోరిడా, యూఎస్ఏ వారు నూతన ఆల యం నిర్మాణము నకు విరాళం రూ.10 కోట్లు విరాళం ఇచ్చారు. 


 *దీనితోపాటు దేవస్థానం నందు జరుగుతున్న అభివృద్ధి పనులు* 


1. రూ.5 కోట్లతో నూతన లడ్డు పోటు మరియు పడి తరం స్టోరు నిర్మాణం


2. సుమారు రూ. 12 కోట్లతో వినాయక సదన్ వసతి గదుల 2 మరియు 3 వ అం  తస్తుల నిర్మాణం


3. సుమారు రూ.9 కోట్లతో భక్తుల సౌక ర్యార్థం నూతన ఏసీ మరియు నాన్ ఏసీ కళ్యాణ మండపం లో నిర్మాణమునకు ప్రతిపాదించడమైనది.


4. సుమారు రూ. 20 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ భవనము నకు సంబంధించిన నిర్మాణమునకు అంచనా వేయడమై నది.


5. సుమారు రూ. 14 కోట్లతో నూతన బస్టాండు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణమునకు అంచనా.


6.  సుమారు రూ. 4 కోట్లతో 100 అడు గుల రోడ్డు మరియు స్వాగతం ఆర్చి గేట్ నిర్మాణము నకు చర్యలు...


 *భక్తులకు సౌకర్యాలు* 


వివిధ రాష్ట్రాల నుం డి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చే భక్తుల కు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు జిల్లా యంత్రాంగం మరి యు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది క్యూలైన్లో భక్తులు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మజ్జిగ అందజేయడంతో పాటు భక్తుల రద్దీ దృష్టి లో ఉంచుకొని అదనంగా భక్తుల సేదతీరేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగు తోంది ..


 *అన్నదానం:* 


 శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనా నికి వచ్చే భక్తులకు దాదాపు 30 వేల మందికి పైగా అన్న దానం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నా రు ఉదయము అల్పాహారం,మధ్యా హ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడంలో భాగం గా దేవస్థానం అన్న దాన భవనం తో పాటు విగ్నేశ్వర కళ్యాణ మండపం లో కూడా ఏర్పాట్లు చేశారు..


 *ప్రసాదాలు*


మహా కుంభాభిషేకం నిమిత్తం భక్తుల రద్దీ ని దృష్టి లో ఉంచు కొని 25 వేలు  చిన్న లడ్డులు(80గ్రాములు)వీటి ధర ఒక్కొ క్కటి రూ.15/-, 400 గ్రాముల లడ్డులను ఐదు వేలు,వీటి ధర ఒక్కొక్కటి రూ.75 /- వడ 2 వేలు, వీటి ధర ఒక్కొక్కటి రూ.10/- ప్రసాదాల కౌంటర్ నందు అందుబాటు లో ఉంచారు..


 *మెడికల్ క్యాంప్*


వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తు లకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన సత్వరమే వైద్య సేవలు అందిం చేందుకు కాణిపాకం హైస్కూల్ నందు 15 నుంచి 18 మంది డాక్టర్లు, 20 మంది ల్యాబ్ టెక్నీషియన్లు తో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 15 లక్షల విలువచేసే మందులను అందు బాటులో ఉంచారు దేవస్థానం నుంచి వై ద్య శిబిరానికి చేరు కునేందుకు వాహనా లను ఏర్పాటు చేయ డమైనది..


 *పోలీస్ బందో బస్తు* 


క్యూలైన్ల నిర్వహణ, వాహనాల రద్దీ, నియంత్రణ,పార్కిం గ్ ప్రదేశాలు తదితర అంశాలకు సంబం ధించి 500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిరం తరం నిఘా కెమెరా ల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్య వేక్షణ జరుగు తున్నది..


విద్యుత్,ఇతర ప్ర మాదాల నివారణకు ముందస్తు ఏర్పాటు లో భాగంగా అగ్ని మాపక శాఖ వాహ నం సిబ్బంది అందు బాటులో కలరు


 *సాంస్కృతిక కార్యక్రమాలు:* 


మహా కుంభాభిషేకం లో భాగంగా ఆది వారం సాయంత్రం ఆస్థాన మండపం లో మంగ్లీచే సాంస్కృ తిక కార్యక్రమాల ఏర్పాటు.*సామాన్య భక్తుల కు దర్శనమునకు అధికప్రాధాన్యత:* 


*జిల్లా కలెక్టర్ యం.హరి నారా యణన్* 


మహా కుంభాభిషేకం సందర్భంగా.విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుం డా అన్ని ఏర్పాట్లకు చర్యలు.పక్కాగా  క్యూలైన్ నిర్వహణ కు భక్తులకు అసౌ కర్యం కలగకుండా ఏర్పాట్లు


 *కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు:*  


   *ఎస్పి రిషాంత్ రెడ్డి*


మహా కుంభాభిషేకం సందర్భంగా పక్కాగా క్యూ లైన్ లో ఏర్పా టు, వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాం..


 *భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తు న్నాం:*


 *పూతలపట్టు శాసనసభ్యులు ఎం.ఎస్.బాబు* 


వెయ్యి   సంవత్స రాలు చరిత్ర కలిగిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహా కుంభాభిషేకం సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుం డా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..


 *మహా కుంభా భిషేకము ను జయ ప్రదం చేయండి:* 

 

      *ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి*


మహా కుంభా భిషేక ము ను జయ ప్రదం చేయాలని, స్వామి వారి కృప కు పాత్రు లు కావాలని కోరా రు..


 *కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి  చేసాం:* 


 *ఆలయ ఈవో సురేష్ బాబు* 

 

మహా కుంభాభిషే కానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్వా మి వారిని దర్శించు కుని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.Comments