మరో నాలుగు కలెక్టరేట్లు సిద్ధం..ఈ నెల 25, 29, వచ్చేనెల 5, 10 తేదీల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌.

 హైదరాబాద్ (ప్రజా అమరావతి);


*మరో నాలుగు కలెక్టరేట్లు సిద్ధం..ఈ నెల 25, 29, వచ్చేనెల 5, 10 తేదీల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌.


*


రాష్ట్రంలో నిర్మాణాలు పూర్తయిన నాలుగు సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాబోయే 20 రోజుల్లో ప్రారంభించనున్నారు. 


ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి కలెక్టరేట్‌ను, 29న పెద్దపల్లి, సెప్టెంబరు 5న నిజామాబాద్‌, 10న జగిత్యాల కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.


 జిల్లాల విభజన తరువాత అన్నిచోట్లా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. అయిదు మినహా అన్ని జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. 


గత వారం మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించారు. దసరాకు ముందు అన్నింటినీ ప్రారంభించాలని భావిస్తున్నారు.


*తెరాస కార్యాలయాలు సైతం*

జిల్లాల పర్యటనలో భాగంగా కొన్నిచోట్ల తెరాస జిల్లా కార్యాలయాలను సైతం సీఎం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు పూర్తయ్యాయి...

Comments