గుంటూరు (ప్రజా అమరావతి);
*గుంటూరు లోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*
*ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రజలకు శభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత*
*రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్ తో ప్రభుత్వాలు పని చెయ్యాలన్న టిడిపి అధినేత
*
* విజన్ 2047, లక్ష్యాలపై 10 సూచనలు చేసిన చంద్రబాబు నాయుడు*
*చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షులు*
• జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలి. ప్రతి ఒక్కరి మదిలో జెండా ఉండాలి.
• 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, సర్థార్ పటేల్, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందాం.
• జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్యను ప్రత్యేకంగా స్మరించుకోవాలి.
• 400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందు ఉంది.
• అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉంది.
• వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయింది.
• ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడింది.
• నెహ్రూ, పివి, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని నడిపించారు.
• దేశం స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరవాత అనేది చూడాలి...అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలి.
• నాడు పివి నరసింహారావు తీసుకున్న సంస్కరణలతో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుంది.
• ఎన్టీఆర్ పేదల కోసం, బడుగుల కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించారు.
• దేశం అంటే ఒక వ్యక్తి కాదు...అందరూ కలిస్తేనే దేశం.
• ప్రతి ఒక్కరు నేషన్ ఫస్ట్ అని ఆలోచించాలి. దాని కోసం పాటుపడాలి.
• నాడు సమర యోధుల త్యాగాల స్ఫూర్తితో నేడు పని చెయ్యాలి.
• హరిత విప్లవం, పాల విప్లవంతో దేశ గమనం మారిపోయింది.
• కరవు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భారత్ మారింది.
• కరోనాకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశంగా అవతరించింది.
• కరోనా అన్ని రంగాలను కుదిపేసింది....కానీ అప్పుడు కూడా పని చేసింది రైతులు మాత్రమే
• దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టిడిపి భాగస్వామిగా ఉంది.
• విజన్ 2020తో నాడే టిడిపి లక్ష్యాలను నిర్థేశించుకుని పని చేసింది.
• తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ అయినా....జాతీయ పార్టీ గా పనిచేసింది.
• నాడు స్వాతంత్ర్యం కోసం సమర యోధులు పోరాడితే...నేడు తెలుగు దేశం ప్రజల కోసం పనిచేసింది.
• టెలీ కమ్యూనికేషన్ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లలో కీలకంగా వ్యవహరించాం.
• నేడు మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాలపైనా....ప్రజల అభివృద్ది పైనా ప్రభావం చూపుతాయి.
• దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుందాం
• మేకిన్ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి వెళ్లాం.
• ఇలాంటివి చూసినప్పుడు మనకు గర్వకారణం.
• 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ప్రతి వ్యక్తిలో స్ఫూర్తి రగలించాలి.
• రానున్న 25 ఏళ్లకు ఏమి చెయ్యాలి అనేది నేడు ఆలోచించాలి.
• ఇప్పటికీ పేదరికం ఉంది...రైతులు ఆత్మహత్యలు ఉన్నాయి...నిరుద్యో సమస్యలు ఉన్నాయి. వీటిపై ఆలోచన చెయ్యాలి.
• ప్రపంచంలో మన వాళ్లు గుర్తింపు సాధించినా సమస్యలు కూడా పీడిస్తున్నాయి.
• ప్రభుత్వ విధానాల వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయి. స్వర్ణ చతుర్భుజి రోడ్ల నిర్మాణంతో అనేక మార్పులు వచ్చాయి.
• ప్రతి ఒక్కరు నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని కాదు....నేను ఏమి ఇచ్చాను అనేది ఆలోచించాలి.
• అదే సమరయోధులకు ఇచ్చిన నిజమైన నివాళి అవుతుంది.
• రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
• 1.విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి.
• 2.ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.
• 3.బలమైన యువశక్తి ఉన్న దేశం ఇండియా. యువకు అవకాశాలు కల్పించాలి.
• 4.దేశంలో సంపద సృష్టి జరగాలి...ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.
• 5.రైతుల కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకురావాలి. 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు.
• 6.విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి.
• 7.మహిళా సాధికారత కు ప్రణాళికలు అమలు చెయ్యాలి.
• 8.దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఎపిలో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేశాం. కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలి.
• 9.అవినీతి లేని పాలనను అందించాలి. టెక్నాలజీ ద్వారా అవినీతిని అంతం చెయ్యాలి.
• 10.ప్రపంచంలో 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలి. అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం కావాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చెయ్యాలి.
addComments
Post a Comment