నెల్లూరు సంఘం రెండు బ్యారేజీలు ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించేందుకు సిద్ధం

 


నెల్లూరు ఆగస్టు 22 (ప్రజా అమరావతి); నెల్లూరు సంఘం రెండు బ్యారేజీలు ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిచే ప్రారంభించేందుకు సిద్ధం


గా ఉన్నాయని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు వెల్లడించారు.



సోమవారం మధ్యాహ్నం

సంగం లోని కలిగిరి రోడ్డు మార్గంలో,, అనంతరం గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ శ్రీ  ఆర్. కూర్మానాధ్ తో కలిసి హెలిపాడు, బహిరంగ సభ కోసం   పరిశీలన చేశారు. గురుకుల పాఠశాలకు ఎదురుగా ఉన్న ఖాలీ స్థలాన్ని చివరిగా హెలీపాడు, బహిరంగ సభ కోసం నిర్ధారిస్తూ ఆ ప్రాంతం మొత్తం బారికేడింగు, భూమి చదును, అప్రోచ్ రోడ్లు బహిరంగ సభ వేదిక హెలిపాడు ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలన్నారు.  ఈనెల 27వ తేదీన జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు డిఆర్సి  సమావేశంలో పాల్గొన్న అనంతరం ఈ ప్రాంతానికి వస్తారని అంతకు ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బ్యారేజీల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్ష వీక్షించేందుకు వీలుగా బహిరంగ సభ ప్రదేశంలో ఎల్ఈడి స్క్రీన్లు  ఏర్పాటు చేయాలన్నారు. 


అనంతరం జిల్లా కలెక్టర్  సంయుక్త కలెక్టర్ తో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు.  అక్కడ నిర్మిస్తున్న పైలాను,బ్యారేజ్ గేట్లు, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్, మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతంరెడ్డి విగ్రహాల ను  వారు పరిశీలించారు.  తదుపరి ఆనకట్ట వంతెనపై చివరి వరకు వాహనాల్లో వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 27వ తేదీలోగా బ్యారేజీ నిర్మాణ పనులు అన్ని విధాల పూర్తి చేయాలని కలెక్టర్ టిజిపి సీఈ శ్రీ హరి నారాయణ రెడ్డి కి సూచించారు.


తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ

నెల్లూరు సంగం రెండు బ్యారేజీలు పూర్తి కావడం వలన ఆరు లక్షల ఎకరాల మాగానికి  సాగునీరుతో పాటు తాగునీటి అవసరాలను తీర్చడం జరుగుతుందన్నారు. ఎన్నా డెల్టా సిస్టం పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఆనకట్టలు నిర్మించడం జరిగిందన్నారు. సంవత్సరానికి రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగిందన్నారు. ఎంతోకాలంగా వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులు పై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. స్థానిక దివంగత మాజీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛగా ప్రాజెక్టు కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ ప్రాజెక్టుల పూర్తి వలన జిల్లా వ్యాప్తంగా సుస్థిరంగా సాగునీటికి అదనపు ఆయకట్టుతోపాటు తాగునీటి అవసరాలు  తీరనున్నాయన్నారు. నీటిపారుదల సలహా మండలి సమావేశం సకాలంలో నిర్వహించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించే ఏర్పాటు చేశామన్నారు. రైతులకు సకాలంలో నీరందించేందుకు వర్షాలు బాగా కురిసినందున జలాశయాలు నీటితో పుష్కలంగా నిండి ఉన్నాయన్నారు. అంతే కాకుండా చెరువులన్నీ నింపుకోవడం జరుగుతుందని తద్వారా జిల్లాలో నీటి కొరత లేకుండా అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా నీరు పంపిణీ చేసే వీలు కలుగుతుందన్నారు. జిల్లా వాసులు అందరి తరపున ముఖ్యంగా రైతుల తరపున రాష్ట్ర  ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 15 నుంచి 20వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని వారికోసం తగినంత మంచినీరు, మరుగుదొడ్లతోపాటు శోభాయమానంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బహిరంగ సభ కోసం స్థల పరిశీలన చేశామని కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీ అన్ని విధాల సహకారం అందిస్తున్నారన్నారు.  ఈనెల 27వ తేదీన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం లో రాష్ట్ర  జల వనరులశాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అంబటి రాంబాబు  జిల్లా అభివృద్ధితోపాటు రెండు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తారన్నారు.


ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  టిజిపి ప్రత్యేక కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి ,ఆత్మకూరు ఆర్డీవో శ్రీమతి కరుణ కుమారి, జలవనరుల శాఖ ఎస్.ఈ. శ్రీ  కృష్ణమోహన్ డిఆర్డిఏ డ్వా మా, ఏపీఎంఐపి  పీడీలు శ్రీ సాంబశివరెడ్డి, శ్రీ వెంకట్రావు శ్రీ శ్రీనివాసులు ఎన్ ఐ సి డి ఐ ఓ శ్రీ సురేష్ కుమార్ ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీ మురళీకృష్ణ డిఎస్.పి  శ్రీ వెంకటేశ్వరరావు భూ సర్వే రికార్డుల ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments