9 మంది దొంగలు అరెస్ట్

 ___ 9 మంది దొంగలు అరెస్ట్


___ 9లక్షల సొత్తు స్వాధీనం 

   కాకినాడ, ఆగస్టు 12 (ప్రజా అమరావతి): 

బంగారు నగల దొంగతనానికి పాల్పడుతున్న 9 మందిని పోలీసులు చేశారు. వారి నుండి 9 లక్షల రూపాయలు విలువైన బంగారు సొత్తును, మోటార్ సైకిల్లను స్వాధీన పరుచుకున్నారు. శుక్రవారం దీనికి సంబంధించి వివరాలను జిల్లా పోలీసు సూపరింటెంట్ ఎం రవీంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 9మంది పిఠాపురం రూరల్, 

కాకినాడ, పిఠాపురం పట్టణాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్దనుండి సుమారు 9 లక్షలు రూపాయలు విలువ చేసే బంగారం, మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.     

   అలాగే ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నేరస్థులు ఏ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారో వివరించారు. ఈ 9 మంది ఓ గ్యాంగ్గా ఏర్పడి స్నేచింగ్ నేరాలు చేస్తున్నారని నేరం చేసే ముందు రెక్కి చేసి, నేరం ఎలా చెయ్యాలి ఏ ఏరియాలో చేయాలి, నేరం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలని వంటి విషయాలు అన్ని చర్చించుకుంటూ ఈ 9మంది దొంగతనాలకు పాల్పడుతున్నారని  చెప్పారు. వీరిపై చైన్ స్నాచింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేసిన కాకినాడ డిఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్, సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు.

Comments