రైతులకు పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్


నెల్లూరు (ప్రజా అమరావతి);

 


స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని 7 గంటల ఉచిత విద్యుత్  ఇవ్వగా, నేడు జననేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పగటి పూట 9 గంటలు  ఉచిత విద్యుత్


అందిస్తున్నట్లు   రాష్ట్ర  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.


గురువారం ఉదయం పొదలకూరులో విద్యుత్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పాల్గొని సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులకు   వైఎస్ఆర్  ఉచిత  వ్యవసాయ విద్యుత్ పధకం కింద రైతులకు 55 ట్రాన్స్ఫార్మర్స్ ను  పంపిణీ చేశారు. ఈ సంధార్బంగా  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,  ఆనాడు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు  రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పగటి పూట 9 గంటలు  ఉచిత  నాణ్యమైన విద్యుత్ ను  అందిస్తున్నట్లు  తెలిపారు. రాష్ట్రంలో రైతులకు  ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన చేసిన మహనీయులు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారని, జిల్లాలో 1600 మెగా వాట్లకు సంబందించి రెండు  విద్యుత్ ప్లాంట్స్ ను జిల్లాలో ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.    నేడు రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అందించడంతో పాటు గృహ అవసరాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.  జిల్లాలో 1.91 లక్షల మండి రైతులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుచున్నదని, దీనికి గాను 70 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  జిల్లాలో  రిజిస్టర్ చేసుకొని డిపాజిట్ కట్టిన ప్రతి రైతుకు విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడం జరుగుచున్నదని తెలిపారు.  అందులో భాగంగా సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో 476 మండి ధరఖాస్తు చేసుకోగా, 301 మంది డిపాజిట్ చేయడం జరిగిందని, వారికి సంబందించి  ఈ రోజు 55 ట్రాన్స్ఫార్మర్స్ ను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలో 3,336 మందికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగిందని దీనికి గాను 32 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.  వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవనం గడుపుచున్న రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచులోని రైతులకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాలకి వెళ్ళి నప్పుడు  సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు,  విధ్యుత్  సౌకర్యం వంటి  సమస్యలను పరిష్కరించాలని కోరడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.  జిల్లాలో  విద్యుత్ సౌకర్యం కల్పించుటకు విద్యుత్ శాఖ అధికారులు 5984 కరెంటు స్థంబాలు అవసరం కాగలవని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని  తెలిపారు.  సమాజంలో పేదల జీవన ప్రమాణాలు  మెరుగయ్యేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  


ఈ కార్యక్రమంలో ఎపిఎస్పిడిసిఎల్  ఎస్.ఈ శ్రీ విజయ కుమార్ రెడ్డి,   మండల ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image